Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
ఆంధ్రప్రదేశ్

చిచ్చుపెట్టిన సెల్‌ఫోన్‌

12 Views

కర్ణాటక: తుమకూరు జిల్లా పావగడ తాలూకాలోని వైఎన్‌ హొసకోట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బూదిబెట్ట గ్రామంలో భర్త చేతిలో భార్య హత్య కు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులో కొచ్చింది. లక్ష్మి (30), రామాంజినప్ప దంపతులు, వీరికి ఇద్దరు చిన్న మగపిల్లలు ఉన్నారు. ఇటీవల భార్య ఎవరితోనో మొబైల్‌ లో మాట్లాడుతోంది.

భర్త రామాంజి తలుపుచాటున ఉండి భార్య మాట్లాడం విన్నాడు. అప్పటినుంచి అనుమానంతో రగిలిపోయాడు, దీనిపై గ్రామంలో పెద్ద మనుషులతో పంచాయతీ పెట్టించగా వారు నచ్చజెప్పారు. కానీ రామాంజినప్ప ఆమెను కడ తేర్చాలని నిర్ణయించుకున్నాడు.

గత మంగళవారం రాత్రి భార్య నిద్రిస్తుండగా రోకలిబండతో తలపై బాదాడు. ఆమెను బయటకు ఈడ్చుకు వచ్చి మళ్లీ బండరాయి తో తల పై కొట్టి హత్య చేశాడు. ఈ దుర్ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసు ఉన్నతాధికారులు ఘటనాస్థలిని పరిశీలించారు. నిందితున్ని అరెస్టు చేయడంతో అటు తల్లి పోయి, ఇటు తండ్రి దూరమై పిల్లలు తల్లడిల్లారు

Related posts

గన్నవరం నుంచే పోటీ చేస్తానంటున్న యార్లగడ్డ వెంకట్రావు.. టీడీపీలో చేరికపై ఏమన్నారంటే

HJNEWS

‘తెర వెనుక ఉంది చిరంజీవే.. భార్యల బంగారం అమ్ముకున్నారు’

HJNEWS

వైఎస్సార్ జయంతి.. ఇడుపులపాలయలో వైఎస్ షర్మిల, విజయమ్మ నివాళులు

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్