Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
ఆంధ్రప్రదేశ్పుణ్యక్షేత్రాలు

తిరుమలలో ‘గోల్డ్‌ మ్యాన్’.. అమ్మో ఇదంతా బంగారమే!

111 Views

తిరుమలలో ఓ గోల్డ్ మ్యాన్ సందడి చేశారు. మెడలో, చేతికి కడియాలు, ఉంగరాలతో వచ్చారు.. ఉదయం స్వామివారిని దర్శించుకుని బయటకు రాగానే భక్తులంతా ఆశ్చర్యంగా చూశారు. ఆయన ఒంటిపై ఉన్న బంగారాన్ని చూసి ఒకింత అవాక్కయ్యారు. ఆయన కూడా భయం, భయంగానే బయటకు వస్తూ కనిపించారు. ఈ గోల్డ్ మ్యాన్‌ది విజయవాడ అని చెబుతున్నారు. జూన్‌లో కూడా ఓ కుటుంబం శ్రీవారి ప్రతిమిలతో బంగారు ఆభరణాలు ధరించిన వచ్చిన సంగతి తెలిసిందే.

తిరుమల శ్రీవారి కోసం నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. వారిలో దేశ, విదేశాల నుంచి వచ్చే సామాన్యుల నుంచి అత్యంత ధనికుల వరకు ఉంటారు. గురువారం మాత్రం విజయవాడకు చెందిన ఓ భక్తుడు పూర్తిగా బంగారు ఆభరణాలు, చైన్లు, బ్రేస్‌లెట్లు, ఉంగరాలతో శ్రీవారి దర్శనానికి వచ్చారు. భారీగా ఆభరణాలతో వచ్చిన ఇతన్ని చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. తిరుమల కొండపై ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కొంత మంది తమ మొబైల్స్‌లో రికార్డ్ చేశారు.

జూన్‌లో కూడా ఓ కుటుంబం ఇలాగే బంగారు ఆభరణాలతో వచ్చి హైలైట్ అయ్యారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన సుభాష్ చంద్ర, సోనీ కుటుంబం వేంకటేశ్వర స్వామి ప్రతిమలతో కూడిన బంగారు ఆభరణాల ధరించి వచ్చారు. శ్రీవారి దర్శనం అనంతరం బయటకు వచ్చిన తర్వాత వీరిని చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. వీరికి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఇలవేల్పు అట.. అందుకే ఇలా స్వామివారి స్వామి, అమ్మవార్ల ప్రతిమలతో కూడిన బంగారు ఆభరణాలను ధరించి తిరుమలకు రావడం ఆనవాయితీ అట. ఆ బంగారు నగలను కూడా తమ పూర్వీకులు తయారు చేయించారని వారు చెప్పారు. వీరిని భక్తులు ఆశ్చర్యంగా చూశారు.

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

మరోవైపు తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. గురువారం శ్రీవారిని 57,443 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.9 కోట్లు వచ్చినట్టు టీటీడీ తెలిపింది. శ్రీవారికి 28,198 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. అన్ని కంపార్ట్‌మెంట్‌లు నిండిపోయి భక్తులు క్యూలైన్ వెలుపలకు వచ్చేశారు. స్వామివారి దర్శనానికి నేడు 18 గంటల సమయం పడుతోంది. వీకెండ్ కావడంతో ఈ రద్దీ ఇంకా పెరుగుతుందని భావిస్తున్నారు.

తిరుమల శ్రీవారి హుండీలో సొమ్ము చోరీ చేసిన వ్యక్తికి జైలు

తిరుమల శ్రీవారి హుండీలో సొమ్ము చోరీ చేసిన కేసులో నిందితుడికి కోర్టు జైలు శిక్ష విధించింది. అతడికి రెండు నెలలు జైలుశిక్ష, రూ.100 జరిమానా విధిస్తూ తిరుపతి రెండో అదనపు మున్సిఫ్‌ కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. నిందితుడు కర్నూలు జిల్లా కోసిగి మండలం జంపాపురానికి చెందిన రామకృష్ణ. ఈ ఏడాది జూన్‌ 15న తిరుమల శ్రీవారి హుండీలో రూ.5,600 చోరీ చేశారు. టీటీడీ విజిలెన్సు అధికారులు నిందితున్ని పట్టుకుని తిరుమల వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కి అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి ఛార్జిషీటు దాఖలు చేశారు. కేసు విచారణలో నిందితుడు నేరం అంగీకరించారు.

Related posts

ఆసక్తికరంగా ఏలూరు ఎంపీ పోరు-కోటగిరి అవుట్ ? ఈసారి ఆళ్లనాని వర్సెస్ చింతమనేని ?

HJNEWS

ఎన్టీఆర్ జిల్లా: రోగి ప్రాణాలు కాపాడేందుకు 108 డ్రైవర్ సాహసం.. బ్రిడ్జిపై వరద నీళ్లు ఉన్నాసరే!

HJNEWS

విద్యార్థుల జీవితాలతో బీజేపీ చెలగాటం.

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్