Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
ఆంధ్రప్రదేశ్

ఎన్టీఆర్ జిల్లా: రోగి ప్రాణాలు కాపాడేందుకు 108 డ్రైవర్ సాహసం.. బ్రిడ్జిపై వరద నీళ్లు ఉన్నాసరే!

24 Views

ఎన్టీఆర్ జిల్లాలో రోగి ప్రాణాలు కాపాడేందుకు 108 డ్రైవర్ సాహసం చేశారు. వత్సవాయికి చెందిన డయాలసిస్ రోగి బాబురావుకు వైద్యం అత్యవసరమైంది. వెంటనే కుటుంబం సభ్యులు 108 వాహనానికి సమాచారం అందించారు. వెంటనే 108 వాహనంలో పెనుగంచిప్రోలు మీదుగా జగ్గయ్యపేటకు తరలిస్తున్నారు. ఇంతలో భారీ వర్షాలతో పెనుగంచిప్రోలు వంతెనపై నుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో వాహనాల రాకపోకల్ని పోలీసులు నిలిపివేశారు.108 వాహనం పెనుగంచిప్రోలు బ్రిడ్జి దగ్గరకు రాగానే వరద ప్రవాహం కనిపించింది.. పోలీసులు వాహనాన్ని అక్కడే ఆపేశారు. రోగి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో 108 పైలెట్ సాహసం చేసి వంతెన పైనుంచి వాహనాన్ని చాకచక్యంగా బయటికి తీసుకువచ్చారు. అక్కడి నుంచి జగ్గయ్యపేటకు రోగిని సురక్షితంగా చేర్చారు. వాహనంలో రోగి పరిస్థితిని అర్థం చేసుకున్న 108 వాహన డ్రైవర్ సాహసోపేతంగా వ్యవహరించి సరైన సమయానికి రోగిని ఆస్పత్రికి చేర్చారు.. దీంతో డ్రైవర్‌‌పై స్థానికులు ప్రశంసలు కురిపించారు.

Related posts

అటు చీర్స్ కొడుతున్న ఛార్మీ..ఇటు కాళ్లు నాకుతున్న ఆర్జీవీ.. పిక్స్ వైరల్

HJNEWS

సినీ ఫక్కీలో లంచావతారం పట్టివేత.. నడిరోడ్డుపై ట్రాప్.. ట్రెండ్‌ మార్చిన ఏసీబీ!

HJNEWS

సముద్రంలో మునిగి విద్యార్థిని మృతి

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్