Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
ఆంధ్రప్రదేశ్

మచిలీపట్నంలో ప్రముఖ వైద్యుడి భార్య దారుణ హత్య.. వాళ్ల పనేనా!

145 Views

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో దారుణం జరిగింది. ప్రముఖ వైద్యుడి భార్య దారుణంగా హత్యకు గురయ్యారు. జవ్వారుపేటకు చెందిన శ్రీ వెంకటేశ్వర నర్సింగ్ హోమ్ పిల్లల వైద్యుడు డా మాచర్ల లోకనాథ్ భార్య డాక్టర్ రాధను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. హత్య చేసిన తర్వాత ఆమె వంటిపై ఉన్న బంగారపు ఆభరణాలను తీసుకుని పారిపోయారు.భర్త మాచర్ల లోకనాథ్, భార్యాభర్తలు ఇరువురు జవార్ పేటలోని తల్లి పిల్లల ఆసుపత్రి నడుపుతున్నారు. మాచర్ల లోక్‌నాథ్ మంగళవారం సాయంత్రం కింది ఫ్లోర్‌లోని క్లినిక్‌కి వెళ్లారు. రాత్రి 11 గంటల సమయంలో ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాధ స్పందించలేదు. లోక్‌నాథ్‌కు అనుమానం వచ్చి వెళ్లి చూడగా రాధ రక్తపు మడుగులో పడి ఉన్నారు.ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌ని తీసుకెళ్లి ఆధారాలు సేకరిస్తున్నారు. డీఎస్పీ మాధవరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించగా నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.. నిందితుల కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టామన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సర్వజన ప్రభుత్వాస్పత్రికి తరలించారు.దోపిడీకి కోసం దొంగలు ఇంట్లో చొరబడి తన భార్య రాధను దారుణంగా హత్య చేసినట్లు లోక్‌నాథ్ అంటున్నారు. గొంతుకోసి హత్య చేసి ,నగదు, నగలు దోపిడీ చేశారని చెబుతున్నారు. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగిందంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఆ ఇంటికి సమీపంలో సీసీ ఫుటేజ్‌ను పరిశీలించే పనిలో ఉన్నారు.

Related posts

బాపులపాడు మండలం వాలంటీర్లకు గౌరవ సత్కారం

HJNEWS

బిగ్‌బాస్ శ్రీసత్య బ్యూటిఫుల్ పిక్స్.. ట్రెడిషనల్ లుక్ అదిరిపోయింది

HJNEWS

విజయవాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం జగన్

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్