Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
ఆంధ్రప్రదేశ్సినిమా వార్తలు

ఫుల్ బాటిళ్లతో బాలయ్యకు అభిషేకం.. చరిత్రలో ఏ హీరోకూ జరగని విధంగా.. వీడియో వైరల్

46 Views

తెలుగు చిత్ర పరిశ్రమంలో హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో నటసింహా నందమూరి బాలకృష్ణ ఒకరు. డివోషనల్ కాన్సెప్టుతో వచ్చిన ‘అఖండ’ మూవీతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కిన తర్వాత రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తోన్న ఆయన.. ‘వీర సింహా రెడ్డి’తో మరో విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ జోష్‌లోనే ఇప్పుడు ‘భగవంత్ కేసరి’ మూవీతో వచ్చారు. ఈ సినిమా విడుదల సందర్భంగా బాలయ్య అభిమానులు చేసిన ఓ వినూత్నమైన పని హాట్ టాపిక్‌గా మారింది. అసలేమైందో మీరే చూసేయండి మరి!

భగవంత్ కేసరిగా వచ్చేశారు:నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రమే ‘భగవంత్ కేసరి’. అనిల్ రావిపూడి తీసిన సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. శ్రీలీల కీలక పాత్రను పోషించింది. అర్జున్ రాంపాల్ విలన్‌ రోల్‌ను చేశాడు. దీనికి థమన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఇక, ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

భారీ స్థాయిలో రిలీజ్ చేస్తూ: క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన ‘భగవంత్ కేసరి’ మూవీ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1400లకు పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. దీంతో అన్ని థియేటర్లూ ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఏపీ, తెలంగాణలోని సినిమా హాళ్లన్నీ నందమూరి అభిమానులతో మోత మోగుతూ రీసౌండ్ ఇచ్చేస్తున్నాయి.

భగవంత్ కేసరికి టాక్ ఇలా:ఎమోషనల్ టచ్‌తో రూపొందిన ‘భగవంత్ కేసరి’ మూవీకి సంబంధించి ఓవర్సీస్ సహా తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో కొన్ని షోలు ప్రదర్శితం అయ్యాయి. అన్ని చోట్లా దీనికి మంచి టాక్ లభించింది. అందుకు అనుగుణంగానే ప్రీమియర్స్, ఎర్లీ మార్నింగ్ షోలకు భారీ స్పందన లభించింది. దీంతో షోలన్నీ హౌస్‌ఫుల్ అయ్యాయి. అలాగే, ఈరోజు బుకింగ్స్ బాగా పెరుగుతున్నాయి.

ఓపెనింగ్స్ భారీగా అంటూ:నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ మూవీకి ఓవరాల్‌గా మంచి టాక్ వచ్చింది. కానీ, అందుకు అనుగుణంగానే ప్రేక్షకుల నుంచి స్పందన మాత్రం భారీ స్థాయిలో వస్తోంది. దీంతో ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో అదిరిపోయే బుకింగ్స్ అయ్యాయి. ఫలితంగా ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్‌ను సొంతం చేసకోవచ్చని విశ్లేషకులు చెప్తున్నారు.

మందుతో అభిషేకం చేసి:విభిన్నమైన కాంబినేషన్‌లో వచ్చిన ‘భగవంత్ కేసరి’ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఊహించిన దానికంటే ఎక్కువ స్పందనే దక్కుతోంది. ఫలితంగా థియేటర్లు అన్నీ ప్రేక్షకుల రాకతో సందడిగా మారాయి. ముఖ్యంగా బాలయ్య అభిమానులు దీన్ని పండుగలా సెలెబ్రేట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఆయన పోస్టర్‌కు మందుతో అభిషేకం చేశారు.

Related posts

సీన్ ఛేంజ్ కలిసొచ్చేదెవరికి -గన్నవరం నియోజకవర్గంలో

HJNEWS

బాపులపాడు గ్రామంలో పారిశుధ్య పనులను ప్రారంభించిన సర్పంచ్ సరిపల్లి కమలా కిరణ్

HJNEWS

ఖుషి ట్రైలర్.. ప్రేమ, పెళ్లి, గొడవలు.. శివ నిర్వాణ మ్యాజిక్

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్