Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
ఆంధ్రప్రదేశ్ప్రత్యేక కథనంరాజకీయం

సీన్ ఛేంజ్ కలిసొచ్చేదెవరికి -గన్నవరం నియోజకవర్గంలో

గన్నవరం నియోజకవర్గంలో గెలిచేదెవరు. రాష్ట్ర వ్యాప్తంగా గన్నవరం ఫలితం పైన ఆసక్తి నెలకొంది. గన్నవరంలో గెలుపు ఇప్పుడు టీడీపీ-జనసేన అభ్యర్థులకే కాదు పార్టీ అధినేతలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. 2019 ఎన్నికల్లో తలపడిన అభ్యర్థులే పార్టీలు మారి మరోసారి ఎన్నికల బరిలోకి దిగారు. హోరా హోరీగా మారుతున్న ఈ ఎన్నికల్లో సామాజిక సమీకరణాలు కీలకంగా మారుతున్నాయి. ఇదే సమయంలో పొత్తుల లెక్కలతో ఫలితం ఆసక్తిని పెంచుతోంది.

గన్నవరం నియోజకవర్గంలో ఆసక్తి కర రాజకీయం కొనసాగుతోంది. 2019 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వల్లభనేని వంశీ వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన యార్లగడ్డ వెంకట్రావు పైన కేవలం 990 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వంశీ 2014, 2019 ఎన్నికల్లో గన్నవరం నుంచి వరుసగా రెండు సార్లు విజయం సాధించారు. 2019 లో వైసీపీ అధికారంలోకి రావటంతో తన మిత్రుడు కొడాలి నాని సూచనతో వైసీపీకి దగ్గరయ్యారు. అప్పటికే నియోజకవర్గంలో యార్లగడ్డ – వంశీ మధ్య రాజకీయంగా పోరు కొనసాగుతోంది. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో యార్లగడ్డ మద్దతు దారులు, వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో, గన్నవరంలో వైసీపీ ముఖ్య నేతలుగా ఉన్న దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకటరావు ఇద్దరూ వంశీకి సహకరించేందుకు నిరాకరించారు.

క్రమేణా వంశీకి నియోజకవర్గంలో వైసీపీ ముఖ్య నాయకత్వం ప్రాధాన్యత ఇచ్చింది. దీంతో, యార్లగడ్డ పార్టీ నేతలతో మాట్లాడినా సరైన స్పందన లేదంటూ పార్టీ మార్పు నిర్ణయం తీసుకున్నారు. టీడీపీలో చేరారు. గన్నవరం బాధ్యతలను వెంకట్రావుకు పార్టీ అప్పగించింది. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంతో వెంకట్రావు అడుగులు వేస్తున్నారు. పార్టీకి ఉన్న ఓట్ బ్యాంక్, నియోజకవర్గంలో ఉన్న మద్దతు వెంకట్రావుకు కలిసొచ్చే అంశాలు. ఇదే సమయంలో నియోజకవర్గంలో దుట్టా రామచంద్రరావు వర్గం నుంచి వంశీకి మద్దతు లభించటం లేదు. తాజాగా దుట్టా రామచంద్రరావుతో కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల భేటీ అయ్యారు. కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానించారు. దుట్టా పార్టీ మారుతారనే ప్రచారం ఉంది. నియోజకవర్గంలో వైసీపీ కోసం పని చేసిన ఇద్దరు ముఖ్య నేతలు దూరం కావటం నష్టంగా కనిపిస్తోంది.

ఇదే సమయంలో వల్లభనేని వంశీకి ఈ ఎన్నికల్లో గెలుపు కీలకంగా మారుతోంది. తాజాగా కొడాలి నానితో సహా సీఎం జగన్ ను కలిసారు. నియోజకవర్గంలో పరిస్థితులను వివరించారు. హోరా హోరీ పోరు ఖాయం అనే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సంక్షేమ పథకాలు..పదేళ్లుగా నియోజకవర్గంలో ఉన్న పరిచయాలు తనకు కలిసి వస్తాయని వంశీ చెబుతున్నారు. ప్రభుత్వం పైన వ్యతిరేకత, వంశీ వ్యాఖ్యలతో సొంత సామాజిక వర్గంలో కనిపిస్తున్న ప్రతికూలత, వ్యక్తిగతంగా తనకు నియోజకవర్గంలో ఉన్న సత్సంబంధాలు తన విజయానికి దోహదం చేస్తాయని యార్లగడ్డ చెబుతున్నారు. వంశీ ఎలక్షన్ చేసే విధానం పైన తనకు పూర్తి అవగాహన ఉందని..దీనికి కౌంటర్ ప్లాన్ తో ఈసారి ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేస్తున్నారు. దీంతో..గన్నవరంలో ఫలితం పైన రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి కనిపిస్తోంది.

Related posts

ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. వైసీపీ ఎమ్మెల్యేలకు టికెట్లు.. షర్మిల పోటీ అక్కడే

HJNEWS

ఏపీ దేశానికే ఆదర్శంగా నిలిచింది.. 50 నెలల్లోనే గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చాం: సీఎం జగన్

HJNEWS

ముందే నిర్ణయం తీసుకున్నారు.. యార్లగడ్డ వైసీపీని వీడటంపై సజ్జల స్పందన

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్