Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
ఆంధ్రప్రదేశ్రాజకీయం

ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. వైసీపీ ఎమ్మెల్యేలకు టికెట్లు.. షర్మిల పోటీ అక్కడే

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది . ఒకే విడతలో 114 అసెంబ్లీ, 5 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కడప ఎంపీ స్థానానికి పోటీ చేయనున్నారు. పలువురు సీనియర్ నేతలు ఈసారి ఎంపీ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఇక కుప్పంలో చంద్రబాబుపైకి పోటీగా ఆవుల గోవిందరాజులను హస్తం పార్టీ నిలుపుతోంది.

ఏపీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గానూ తొలి విడతలో 114 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. అలాగే 25 ఎంపీ సీట్లకు గానూ 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ మేరకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇటీవలే ఢిల్లీ వెళ్లారు. పార్టీ నుంచి పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల జాబితాను హైకమాండ్‌కు అందజేశారు. ఆశావహుల నుంచి గెలుపు గుర్రాలను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించింది.

ఎంపీ అభ్యర్థుల విషయానికి వస్తే అందరూ ఊహించిన విధంగానే, ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లుగానే వైఎస్ షర్మిల కడప లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. కడప ఎంపీ సీటు కోసం వైసీపీ నుంచి అవినాష్ రెడ్డి పోటీ చేస్తుండగా.. షర్మిల తన సోదరుడితోనే పోటీ పడనున్నారు. ఇక కాకినాడ లోక్ సభ స్థానం నుంచి పల్లం రాజు, రాజమండ్రి లోక్‌ సభ స్థానం నుంచి గిడుగు రుద్రరాజు, బాపట్ల ఎంపీ సీటు నుంచి జేడీ శీలం, కర్నూలు లోక్ సభ స్థానం నుంచి పీజీ రాంపుల్లయ్య యాదవ్ పోటీ చేయనున్నారు.

ఎమ్మెల్యే సీట్ల సంగతికి వస్తే మాజీ మంత్రి, ఏపీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శైలజానాథ్ శింగనమల అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నారు. కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా ఆవుల గోవిందరాజులును బరిలో నిలుపుతున్నారు. పిఠాపురం అభ్యర్థిగా మేడేపల్లి సత్యానందరావు పోటీ చేస్తున్నారు. అలాగే ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన కాంగ్రెస్ పార్టీలో చేరిన నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా సిట్టింగ్ స్థానాల నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేయనున్నారు.

Related posts

గన్నవరం సీటు గెలిపించి జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇస్తాం.. దుట్టా

HJNEWS

జర్నలిస్టు ల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడుదాం. 

HJNEWS

విలేకరి ఇంటిపై విధ్వంసకాండ

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్