మానవతా చైర్మన్ మారుబోయిన కోటేశ్వరరావు
తెలుగువారి ఖ్యాతిని దశదిశల వ్యాపింపజేసిన మహోన్నత వ్యక్తి జాతీయ పతాక రూపశిల్పి పింగళిమానవతా స్వచ్ఛంద సేవా సంస్థ హనుమాన్ జంక్షన్ శాఖ ఆధ్వర్యంలో బుదవారం వేలేరు జవహర్ నవోదయ విద్యాలయంలో జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మానవతా చైర్మన్, జాతీయ ఉత్తమ ఉ పాధ్యాయ గ్రహీత, మారుబోయిన కోటేశ్వరరావు మాట్లాడుతూ భారత జాతీయ పతాక రూపశిల్పి గా తెలుగు వారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తి పింగళి అని కొనియాడారు. త్రివర్ణ పతాకం సృష్టికర్త పింగళి దేశభక్తి ఎనలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ సుభాని,మానవత నవోదయ వైస్ ప్రిన్సిపాల్ యదునందనరావు తదితరులు ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో మానవతా అధ్యక్షులు కూరేళ్ళ సుబ్బాచారి, సెక్రటరీ, లయన్ కళ్ళేపల్లి నారాయణరావు, వడ్డి రాజేశ్వరరావు, కొట్నాని రామ చంద్రరావు, పి. వి. ఎస్, చలం, చెక్కా సుబ్బారావు, కన్నిగంటి సుబ్బారావు, ఏ.ఈ, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.