Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
ఆంధ్రప్రదేశ్రాజకీయం

ఆ బాధ్యత నేను తీసుకుంటా.. కడప జిల్లాలో చంద్రబాబు వ్యాఖ్యలు

105 Views

Chandrababu Kadapa Tour టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనల్లో మళ్లీ బిజీ అయ్యారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసం పై యుద్దభేరి కార్యక్రమంలో భాగంగా కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. రోజుకో జిల్లాలో పర్యటించి అక్కడి ప్రాజెక్టుల గురించి వివరిస్తాను అన్నారు. పోలవరాన్ని చూస్తే చాలా బాధగా ఉందని.. ముంపు మండలాలను కలిపితేనే ప్రమాణం చేస్తానని చెప్పానన్నారు. రాయలసీమలోని ప్రాజెక్టుల్ని నిర్లక్ష్యం చేశారని.. టీడీపీ హయాంలో ప్రాజెక్టుల కోసం రూ.12వేల కోట్లు కేటాయిస్తే.. ఈ ప్రభుత్వం మాత్రం రూ.2వేల కోట్లే కేటాయించిందన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా జమ్మలమడుగులో చంద్రబాబు పర్యటించారు. సాగునీటి ప్రాజెక్టు ల విధ్వంసంపై యుద్ధభేరిలో భాగంగా అన్ని జిల్లాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. నందికొట్కూరుతో ప్రారంభించి, పాతపట్నంతో ముగింపు పలుకుతాననన్నారు. జమ్మల మడుగు నియోజకవర్గంలో భూపేశ్ రెడ్డి బుల్లెట్‌లా దూసుకుపోతున్నారని.. జమ్మలమడుగులో సైకిల్ రెపరెపలాడుతోందన్నారు.అధికారపార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ఎలా ప్రవర్తిస్తున్నారో ప్రజలు ఆలోచించుకోవాలని.. భూపేశ్ రెడ్డి ప్రజల కోసం పనిచేస్తున్నారన్నారు. వెనుకబడిన వర్గాలు ఎక్కువగా ఉండే నియోజకవర్గమైన జమ్మలమడుగు తెలుగుదేశానికి కంచుకోటని.. దోచుకోవాలనే ఆరాటం తప్ప ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన ఈ ముఖ్యమంత్రికి లేదన్నారు. జమ్మలమడుగులో ఒక్క ప్రాజెక్ట్ కట్టి, ఒక్క ఎకరాకైనా ఈ ముఖ్యమంత్రి నీళ్లిచ్చారా అని ప్రశ్నించారు. రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టుల కోసం తాను ఐదేళ్లలో సీమలో రూ.12వేలకోట్లు ఖర్చుపెడితే.. ఈయన సీఎం రూ.2వేలకోట్లు ఖర్చుపెట్టారని విమర్శించారు.

తాను రాయలసీమలోనే పుట్టానని.. సీమను రతనాల సీమగా మార్చే బాధ్యత తనదే అన్నారు. దోపిడీ రాజ్యాన్ని అంతంచేసి పేదల్ని ధనికుల్ని చేయాలన్నదే తన ఆలోచనగా చెప్పారు. తాను ముందు చూపుతో ఆలోచిస్తానని.. ఈ ముఖ్యమంత్రివి అన్నీ దొంగచూపులే అంటూ ఎద్దేవా చేశారు. స్థానికులకు ఇసుక దొరకదు.. జమ్మలమడుగు నుంచి ఇసుక బెంగుళూరు, చెన్నైకి తరలిపోతోందన్నారు.

ఎలాంటి మద్యం అమ్ముతున్నారో చూస్తున్నామని.. మద్యం కొంటే బిల్లు ఇవ్వరన్నారు. నాసిరకం మందు అమ్మడం ద్వారా వచ్చే కలెక్షన్ అంతా తాడేపల్లి ప్యాలెస్ కు చేరుతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో చేతిలోని ఓటు అనే ఆయుధాన్ని సక్రమంగా వినియోగించాలన్నారు. భావి తరాల గురించి, రాష్ట్రం గురించి ఆలోచించాలన్నారు. భూపేశ్ రెడ్డిని బలపరిచి.. జమ్మలమడుగులో తెలుగుదేశంపార్టీని గెలిపించాలన్నారు. ప్రజలు చేయాల్సింది చేస్తే.. తాను వారికి అండగా ఉంటానన్నారు. మహాశక్తి పథకంతో ఆడబిడ్డలకు అండగా ఉంటానని చెప్పారు. అలానే తమ్ముళ్లకు ఉద్యోగ, ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటానని.. రైతుల్ని ఆదుకుని.. అందరికీ న్యాయం చేస్తానన్నారు.

మరోవైపు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం పులివెందులలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ క్రమంలోపులివెందులలోని పూలంగళ్ల సెంటర్‌లో సభకు టీడీపీ ప్లాన్ చేసింది.. బాబు పర్యటన, సభ కోసం టీడీపీ నేతలు పోలీసుల అనుమతి కోరారు. అయితే పూలంగళ్ల సెంటర్‌లో చంద్రబాబు బహిరంగ సభకు పోలీసులు అభ్యంతరం తెలిపారని టీడీపీ నేతలు అంటున్నారు. సర్కిల్‌కు కొద్ది దూరంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరకు సభను మార్చుకోవాలని పోలీసులు చెప్పారన్నారు. పోలీసుల ఒత్తిడితో సభను పూలంగళ్ల సర్కిల్ నుంచి వెంకటేశ్వర ఆలయం దగ్గరకు మార్చారు.

Related posts

ఏపీ ఎన్నికల ఫలితాలపై మళ్లీ ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఈసారి సీన్ రివర్స్‌లో!

HJNEWS

పేదల నోటికాడ ముద్దను అందకుండా చేస్తారా?

HJNEWS

చిలకలూరి పేటలో భారీసభ.. బస్సులు కావాలి..

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్