తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వైకాపా సర్కారును మీడియా ముందు ఎండగట్టారు. అమరావతిలో తెదేపా కేంద్ర కార్యాలయంలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో కలిసి మీడియాతో మాట్లాడిన అచ్చెన్నాయుడు.. తెదేపా-జనసేన అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత వైకాపా వణికిపోయిందన్నారు.
ఈనెల 17న చిలకలూరిపేటలో నిర్వహించే భారీ బహిరంగ సభలో తెలుగుదేశం- జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటిస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ బహిరంగ సభ ద్వారా భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. చిలకలూరిపేట సభకు బస్సులు ఇవ్వాల్సిందే అని.. సభకు బస్సులు కావాలని ఈ రోజు లెటర్ పెడుతున్నామని, బస్సులు ఇవ్వకపోతే ప్రస్తుతం ఉన్న అధికారులు త్వరలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆర్టీసీ ఎండీని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.
టీడీపీ – జనసెన సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు బెదిరిస్తే 7306299999 కాల్ సెంటర్‌కు ఫోన్ చేయవచ్చని.. టీడీపీ తక్షణమే స్పందిస్తుందని అచ్చెన్నాయుడు వెల్లడించారు.
ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. చిలకలూరి పేట సభ సరికొత్త చరిత్ర సృష్టిస్తుందన్నారు. క్షేత్రస్థాయిలో వివిధ కమిటీలను ఏర్పాటు చేసి కలిసికట్టుగా విజయవంతం చేస్తామన్నారు.
ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. చిలకలూరి పేట సభ సరికొత్త చరిత్ర సృష్టిస్తుందన్నారు. క్షేత్రస్థాయిలో వివిధ కమిటీలను ఏర్పాటు చేసి కలిసికట్టుగా విజయవంతం చేస్తామన్నారు.