Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
ఆంధ్రప్రదేశ్తెలంగాణసినిమా వార్తలు

భోళా.. ఏం బాలా.. ‘ఉడాల్’ రివ్యూపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం.. ఆది పురుష్ నచ్చిందా? ఇది నచ్చలేదా?

సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి. వాటిలో హిట్ చిత్రాలు అప్పుడప్పుడూ మాత్రమే వస్తాయి. ఫ్లాప్ చిత్రాలు ప్రతి శుక్రవారం పలకరిస్తూనే ఉంటాయి. అందరి స్టార్‌లకు హిట్, ఫ్లాప్‌లు సర్వసాధారణం. కానీ మెగా హీరోల సినిమా ఫ్లాప్ అయితే మాత్రం ప్రత్యేకించి ఓ వర్గానికి మాత్రం పండగే. వాళ్లు పొందే ఆనందం మామూలుగా ఉండదు.

‘ఆది పురుష్’ సినిమా చూస్తుంటే నాకు స్వర్గంలో తేలినట్టు ఉంది.. ‘బ్రో’ సినిమా నచ్చలేదు’ అంటూ రివ్యూలు చెప్పి నెటిజన్లతో తిట్లు తిన్న బిగ్ బాస్ ఆదిరెడ్డి.. ఇప్పుడు మరోసారి ‘భోళా శంకర్’ సినిమాకి రివ్యూ ఇచ్చేశారు. ఈ సినిమా అస్సలు బాలేదంటూ ఆదిరెడ్డి రివ్యూ ఇవ్వడంతో మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అసలు నువ్వు ఏ సినిమాకి రివ్యూ సక్కగా ఇచ్చావ్ గనుకా.. రివ్యూలు చెప్పడం కాదు.. నువ్వే సినిమా తియ్.. అప్పుడు తెలుస్తుంది.. నీ సినిమా మేం చెప్తాం రివ్యూ’ అంటూ కౌంటర్లు ఇస్తున్నారు.

ఇంతకీ ‘భోళా శంకర్’ సినిమా చూసిన తరువాత ఆదిరెడ్డి ఏమన్నాడంటే.. ‘భోళా శంకర్ ’ మూవీ నాకు నచ్చలేదు. సినిమా బాలేకపోవడానికి కారణం చిరంజీవి గారు కాదు. మెహర్ రమేష్ డైరెక్షనే. ఈ పాత్రను సరిగా ఉపయోగించుకోలేదు. సాగదీత సీన్లు చాలా ఉన్నాయి. మెగాస్టార్ రేంజ్‌కి తగ్గట్టుగా సీన్లు లేవు. కామెడీ కూడా బాలేదు.

ఈ సినిమాలో ప్లస్‌లు ఏవైనా ఉన్నాయా అంటే.. చిరంజీవి గారే. ఆయన ఫైట్లు, ఆయన డాన్స్, ఆయన యాక్టింగ్.. ఇవి తప్ప మిగిలినవన్నీ మైనస్‌లే. సాంగ్స్ కూడా ఓకే ఓకే అన్నట్టుగా ఉన్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగోలేదు. భోళా శంకర్ చూసిన తరువాత నాకు అనిపించింది జెన్యూన్‌గా అనిపించింది ఇదే’ అంటూ రివ్యూ చెప్పేశాడు ఆదిరెడ్డి. ఇదే కాదు.. బిగ్ బాస్ తరువాత.. ఏ సినిమా వచ్చినా దానికి రివ్యూ చెప్తూ వీడియో వదులుతున్నాడు ఆదిరెడ్డి. ఆ మధ్య ‘ఆదిపురుష్’ బాగుందని.. బాలేదని చెప్పిన వెధవల్ని నమ్మొద్దని నోటికొచ్చినట్టు రివ్యూ చెప్పి ట్రోలింగ్ బారిన పడ్డాడు ఆదిరెడ్డి. ‘ఆది పురుష్’ బాగుండటం ఏంట్రా ఉడాల్.. అని ఆదిరెడ్డిని ట్రోల్ చేశారు.

ఇప్పుడు ‘భోళా శంకర్’‌కి నెగిటివ్ టాక్ వస్తోంది. సినిమా బాలేదని ఆదిరెడ్డి నెగిటివ్ రివ్యూ ఇవ్వడంతో ఫ్యాన్స్ హర్ట్ అయిపోతున్నారు. ‘డబ్బులు బాగానే సంపాదించావ్ కదా.. నువ్వే డైరెక్ట్ చేయి.. అప్పుడు మేము చెప్తాం రివ్యూ’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయడంతో దానికి కౌంటర్ ఇచ్చాడు ఆదిరెడ్డి. ‘మామా ఒక సెలూన్‌కి వెళ్తాం.. వాడు సరిగా కటింగ్ చేయలేదు అని రివ్యూ బాలేదని రాస్తే వాడు నవ్వు వచ్చి చెయ్ కటింగ్ అంటారా చెప్పు.. రెస్టారెంట్‌లో ఫుడ్ బాలేదు అంటే.. వచ్చి వండుకో అంటారా? అందరికీ మూవీస్ తీయడం వస్తే చూసేది ఎవడు? ఇది సినిమాపై నా అభిప్రాయం మాత్రమే’ అని రిప్లై ఇచ్చాడు ఆదిరెడ్డి.

మిగిలిన నెటిజన్లు కూడా ఇతని రివ్యూలను నమ్మొద్దు.. నీలాంటి వాళ్లు రివ్యూలు నమ్మితే.. థియేటర్స్‌కి వెళ్లి సినిమా చూడాలనుకునే వాళ్ల మూడూ ఉత్సాహం మొత్తం దొబ్బుతాయి.. నీ రివ్యూలు బిగ్ బాస్‌కి చెప్పుకో బ్రో.. సినిమాలకు చెప్తే నెగిటివ్ అవుతావు.. బ్రో సినిమా బాలేదన్నావ్.. ఆదిపురుష్ సూపరన్నావ్.. ఇప్పుడు భోళాశంకర్ బాలేదంటున్నావ్.. మీకు మెగా మూవీస్ నచ్చవు అని అర్ధం అయ్యిందిలే’ అంటూ అంటూ ఆదిరెడ్డికి కౌంటర్లు ఇస్తున్నారు మెగా ఫ్యాన్స్.

Related posts

బాపులపాడు మండలం వాలంటీర్లకు గౌరవ సత్కారం

HJNEWS

ఏపీ: ప్రయాణికులకు అలర్ట్.. విజయవాడ, విశాఖ మీదుగా వెళ్లే ఈ రైళ్లు వారం రద్దు

HJNEWS

పంచాయతీ కార్మికులపై.. దయ చూపండి!

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్