Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
సినిమా వార్తలు

ప్రముఖ నటి జయప్రదకు షాక్.. ఆరు మాసాల జైలు శిక్ష విధించిన చెన్నై కోర్టు

108 Views

దక్షిణాదిలో ఓ వెలుగు వెలిగి.. అనంతం బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ కూడా అగ్ర కథానాయికగా సత్తా చాటారు సీనియర్ నటి జయప్రద. అంతేకాదు, యూపీ నుంచి ఆమె రెండు సార్లు సమాజ్ వాదీ పార్టీ నుంచి ఎంపీగా గెలిచారు. అయితే, చైన్నైలోని జయప్రద నిర్వహించే థియేటర్ కాంప్లెక్స్‌కు సంబంధించిన కేసులో కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ఆమె సహా మరో ముగ్గుర్ని దోషులుగా పేర్కొంటూ 6 మాసాల జైలు శిక్ష చెప్పింది.

ఓ కేసులో మాజీ ఎంపీ, ప్రముఖ సినీ నటి జయప్రదకు చెన్నై కోర్టు ఆరు మాసాల జైలు శిక్షను విధించింది. ఇదే కేసులో మరో ముగ్గుర్ని కూడా దోషులుగా నిర్దారించిన ఎగ్మోర్ కోర్టు.. శిక్ష ఖరారు చేసింది. దోషులకు రూ.5 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. కేసు వివరాల్లోకి వెళ్తే.. చెన్నై నగరంలోని రాయపేట అన్నా రోడ్డులో రామ్ కుమార్, రాజబాబుతో కలిసి సినిమా థియేటర్‌ను నడిపించారు. ఆ థియేటర్‌లో పనిచేస్తున్న కార్మికులు తమ నుంచి వసూలు చేసిన ఈఎస్ఐ మొత్తాన్ని చెల్లించలేదని కార్మిక బీమా రాజ్య బీమా సంస్థకు ఫిర్యాదు చేశారు.

దీంతో ఈఎస్ఐ సంస్థ ఎగ్మోర్ కోర్టులో కేసు దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. నటి జయప్రద, రామ్ కుమార్, రాజబాబులకు నోటీసులు జారీచేసింది. అయితే, తమకు వ్యతిరేకంగా దాఖలైన కేసును కొట్టివేయాలని మద్రాసు హైకోర్టును జయప్రద ఆశ్రయించారు. అయితే, ఆమె అభ్యర్థనను మద్రాస్ హైకోర్టు తిరస్కరించింది. కార్మికుల పిటిషన్‌ను విచారించిన ఎగ్మోర్ కోర్టు.. శుక్రవారం తీర్పు వెలువరించింది. జయప్రదతో పాటు మరో ముగ్గుర్ని దోషులుగా నిర్దారించిన కోర్టు.. వీరికి ఆరు మాసాల జైలు శిక్షను విధించింది.

కొన్నేళ్ల కిందట థియేటర్‌ కాంప్లెక్స్‌కు సంబంధించి రూ. 20 లక్షల ఆదాయపు పన్ను బకాయి పడటంతో సిటీ సివిల్ కోర్టు ఆదేశాల మేరకు థియేటర్‌లోని కుర్చీలు, ప్రొజెక్టర్, ఫిల్మ్ రోల్స్‌ను కార్పొరేషన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విధుల్లో ఉన్న ఉద్యోగులు తక్షణ వాయిదా కింద రూ.5 లక్షలు ఇవ్వగా, మొత్తం డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ)గా చెల్లించాలని డిమాండ్ చేశారు.

Related posts

నడి రోడ్డుపై అరియానా అందాల ఆరబోత.. బిగ్ బాస్ బ్యూటీ మైండ్ బ్లోయింగ్ గ్లామర్ డోస్

HJNEWS

ఆడవాళ్లే బట్టలిప్పి పోలీసులపై దాడి చేశారు.. మణిపూర్ ఘటనపై కరాటే కళ్యాణి దారుణమైన పోస్ట్

HJNEWS

భోళా.. ఏం బాలా.. ‘ఉడాల్’ రివ్యూపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం.. ఆది పురుష్ నచ్చిందా? ఇది నచ్చలేదా?

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్