Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
సినిమా వార్తలు

భజన పొగడ్తలకు అలవాటుపడి రియాల్టీకి దూరమవుతున్నారు.. చిరంజీవికి ఆర్జీవీ పంచ్

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ‘భోళా శంకర్’ (Bholaa Shankar) సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వినిపిస్తోంది. సినిమాలో కొత్తదనం లేదని, ఔట్ డేటెడ్‌గా ఉందని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma).. చిరంజీవిపై చేసిన కామెంట్ వైరల్ అవుతోంది.

దేనికైనా సమయం రావాలి అంటారు. ఆ సమయం ఇప్పుడు రామ్ గోపాల్ వర్మకి (Ram Gopal Varma) వచ్చింది. అందుకే, మెగాస్టార్ చిరంజీవిని (Chiranjeevi).. ఆయన భజన బ్యాచ్‌ని టార్గెట్ చేస్తూ వర్మ కామెంట్లు చేస్తున్నారు. భజన పొగడ్తలకి అలవాటుపడిపోయి చిరంజీవి రియాల్టీకి దూరమవుతున్నారంటూ వర్మ విమర్శించారు. ‘భోళా శంకర్’ సినిమా ప్రమోషన్‌లో చిరంజీవిపై హైపర్ ఆది లాంటి వాళ్లు కురిపించిన ప్రశంసల వర్షం.. ఇప్పుడు సినిమా ఫలితాన్ని ఉద్దేశించి వర్మ ఈ ట్వీట్ చేశారు. అది కూడా వెటకారంగా.

‘జబర్, హైపర్ లాంటి ఆస్థాన విదూషకుల భజన పొగడ్తలకి అలవాటుపడిపోయి, రియాల్టీకి మెగా దూరమవుతున్నారని అనిపిస్తోంది’ అని వర్మ ట్వీట్ చేశారు. అంతేకాదు, ‘పొగడ్తలతో ముంచే వాళ్ల బ్యాచ్ కన్నా ప్రమాదకరమైన వాళ్లు ఉండరు. రియాల్టీ తెలిసే లోపల రాజు గారు మునిగిపోతారు. వాళ్ల పొగడ్తల విషం నుంచి తప్పించుకోవాలంటే ఆ జాతిని మైల్ దూరం పెట్టటమే’ అంటూ చిరంజీవికి సలహా కూడా ఇచ్చారు వర్మ. ఇది వందశాతం కరెక్ట్ అంటూ చాలా మంది కామెంట్లు పెడుతున్నారు.

మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ ఎప్పటి నుంచో వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని ఆయన సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్‌ను హేళన చేస్తూ సినిమా కూడా తీసేశారు. అయితే, పవన్ కళ్యాణ్‌ను కించపరిచే రామ్ గోపాల్ వర్మపై ‘జబర్దస్త్’ కమెడియన్, రైటర్ హైపర్ ఆది ఎప్పటి నుంచో సెటైర్లు వేస్తున్నారు. ‘జబర్దస్త్’లో స్కిట్లు చేశారు. ఇక ఈ మధ్య మెగా సినిమా ఈవెంట్లలో స్పీచ్‌లతో చెలరేగిపోతున్న హైపర్ ఆది.. వర్మపై పరోక్షంగా పంచ్‌లు వేస్తున్నారు.

ఇటీవల జరిగిన ‘భోళా శంకర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హైపర్ ఆది స్పీచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనికి కారణం ఆయన మెగా ఫ్యామిలీ గురించి, మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడిన విధానం.. పొగడ్తల వర్షం. ఈ ఈవెంట్‌లో ఆది మాట్లాడుతూ.. గతంలో చిరంజీవిని విమర్శించిన వారందరినీ ప్రస్తావించారు. ఈ క్రమంలో ఆర్జీవీ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. ‘ఈ టాలీవుడ్‌లోనే ఒక డైరెక్టర్ ఉన్నారు. ఆయన్ని అనే స్థాయి నాకు లేదు. అలాగే, మెగాస్టార్‌ని, పవర్ స్టార్‌ని విమర్శించే స్థాయి ఆయనకీ లేదు. ఆయన ఒక చిన్న పెగ్ వేసినప్పుడు చిరంజీవిని, పెద్ద పెగ్ వేసినప్పుడు పవన్ కళ్యాణ్‌ని విమర్శిస్తారు’ అంటూ ఆర్జీవీని ఉద్దేశించి మాట్లాడారు.

బహుశా హైపర్ ఆది మాట్లాడిన మాటలనే దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ పంచ్ వేసినట్టున్నారు. అందుకే ‘జబర్దస్త్’‌ని ‘జబర్’ అని, హైపర్ ఆదిని ‘హైపర్’ అని పరోక్షంగా, వెటకారంగా ప్రస్తావించారు. అంతేకాదు.. ‘భోళా శంకర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవిపై ప్రశంసల వర్షం కురిపించిన దర్శకులందరినీ ఆస్థాన విదూషకులుగా పోల్చారు. ఈ భజన పొగడ్తలకు చిరంజీవి అలవాటు పడిపోయారంటూ విమర్శించారు. అయితే, ఆర్జీవీ ట్వీట్‌పై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా.. యాంటీ ఫ్యాన్స్, వైసీపీ సానుభూతిపరులు మాత్రం ‘వేస్కో నా రాజా’ అంటూ ఎంకరేజ్ చేస్తున్నారు.

Related posts

మొరగని కుక్క లేదు.. విమర్శించని నోరు లేదు.. రజనీకాంత్ వీడియో వైరల్

HJNEWS

విశ్వంభరలో ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్.. ఆ సెంటిమెంట్ ప్రకారం ఇది కూడా హిట్టే!

HJNEWS

NBK 109​ ఆ హీరోయిన్​కు బాలయ్య సర్​ప్రైజ్… సెట్స్​లో సెలబ్రేషన్స్​తో రచ్చ రచ్చ

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్