Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
ఆంధ్రప్రదేశ్సినిమా వార్తలు

ది మోస్ట్ స్టైలిష్‌గా విజయ్.. ఖుషి టైటిల్ సాంగ్ వైరల్

102 Views

ఖుషి టైటిల్ సాంగ్‌ను కాసేపటి క్రితమే రిలీజ్ చేశారు. ఈ పాట అంతా ఒకెత్తు అయితే.. విజయ్ లుక్స్ మరో లెవెల్లో ఉన్నాయి. ఇంత వరకు విజయ్‌ని చూపించిన దానికంటే ఇందులో మరో కొత్త స్టైల్లో చూపించేశాడు శివ నిర్వాణ. ఈ టైటిల్ సాంగ్‌లో విజువల్స్, విజయ్ లుక్స్ వైరల్ అవుతున్నాయి.

విజయ్ దేవరకొండ సమంత శివ నిర్వాణ కలిసి ఓ మ్యాజిక్ చేయబోతోన్నట్టుగా వైబ్ వస్తోంది. ఖుషి సినిమా చుట్టూ పాజిటివ్ వైబ్స్ అల్లుకున్నాయి. దీనికి తగ్గట్టుగా పాటలు అన్నీ క్లిక్ అవుతున్నాయి. నా రోజా నువ్వే అనే పాట ఇప్పుడు యూత్‌కు మంత్రంగా మారింది. ఆరాధ్య అనే పాట కూడా చార్ట్ బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు మూడో పాటను రిలీజ్ చేశారు. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ పాటలతో మరింత హైప్ పెంచేస్తున్నారు

.తాజాగా రిలీజ్ చేసిన ఖుషి టైటిల్ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పాటను శివ నిర్వాణ రాయగా.. హేషం అబ్దుల్ వాహబ్ పాడాడు. ఇక స్వరకర్త కూడా ఆయనే అన్న సంగతి తెలిసిందే. హేషం అబ్దుల్ వాహబ్ అందిస్తున్న పాటలకు తెలుగు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. అసలే కుర్రాళ్లు హృదయం మేనియా నుంచి ఇంకా బయటకు రాలేదు. మొత్తానికి ఖుషి పాటలతో తెలుగు వారిని హేషం బాగానే మెప్పిస్తున్నాడు.

ఖుషి టైటిల్ సాంగ్‌లో లిరిక్స్, ట్యూన్ అన్నీ ఒకెత్తు అయితే.. విజువల్స్, విజయ్ లుక్స్ మరో ఎత్తు. విజయ్ ఇందులో ది మోస్ట్ స్టైలిష్ మెన్‌గా కనిపిస్తున్నాడు. సమంత, విజయ్‌ల కెమిస్ట్రీ ఈ సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది. ఈ పాట కూడా రీల్స్, షార్ట్స్‌లో ట్రెండ్ అయ్యేలానే కనిపిస్తోంది. ఇక ఈ చిత్రాన్ని భారీ ఎత్తున మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.

ఆల్రెడీ మూవీ షూటింగ్‌ను శివ నిర్వాణ పూర్తి చేసేశాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. సెప్టెంబర్ 1న ఈ మూవీని పాన్ ఇండియా వైడ్‌గా భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఈ సారి విజయ్ పాన్ ఇండియన్ రేంజ్‌లో హిట్టు కొట్టేలానే కనిపిస్తున్నాడు.

Related posts

అనసూయ అందాల దూకుడు, ఏకంగా బికినీలో మెరుపులు.. స్విమ్మింగ్ పూల్ లో భర్తతో, దారుణంగా ట్రోలింగ్

HJNEWS

వివేకా హత్య కేసు: నేను చెప్పినదానిని సీబీఐ మార్చింది.. హైకోర్టును ఆశ్రయించిన అజయ్ కల్లాం..

HJNEWS

తాగి సెట్స్ కి వచ్చావా అని పవన్ కళ్యాణ్ అడిగారు- సాయి ధరమ్ తేజ్ 

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్