143 Views
తాగి సెట్స్ కి వచ్చావా అని పవన్ కళ్యాణ్ అడిగారు- సాయి ధరమ్ తేజ్
మామ అల్లుళ్లు పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ల మల్టీస్టారర్ బ్రో విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్న సాయి ధరమ్ తేజ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
బ్రో మూవీ జులై 28న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. పొలిటికల్ గా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ చిత్ర ప్రమోషన్స్ కో దూరంగా ఉన్నారు. అయితే సాయి ధరమ్ తేజ్ ప్రోమోట్ చేస్తున్నారు. ఆయన తీరిక లేకుండా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. హీరోయిన్ కేతిక శర్మ సైతం చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. మామయ్య పవన్ కళ్యాణ్ తో నటించడం గొప్ప అనుభూతి అని చెప్పిన సాయి ధరమ్ తేజ్… కొన్ని సన్నివేశాల్లో ఇబ్బంది పడ్డట్లు వెల్లడించారు.