Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
ఆంధ్రప్రదేశ్సినిమా వార్తలు

దొరికిపోయిన రష్మిక.. విజయ్ వేసుకున్న షర్ట్‌‌తో ప్రత్యక్షం.. ఇది అదేనా?

నేషనల్ క్రష్ రష్మిక మందన, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మధ్య గల క్లోజ్‌నెస్ గురించి తెలిసిందే. ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్‌‌కు సంబంధించి నెట్టింట అనేక రూమర్స్ వ్యాపిస్తున్నాయి. దీనిపై క్లారిటీ ఇచ్చినప్పటికీ తాజాగా రష్మిక వేసుకున్న షర్ట్‌ను నెటిజన్లు పాయింట్ అవుట్ చేయడంతో మరోసారి డేటింగ్ వార్తలు వైరల్ అవుతున్నాయి.

‘గీతా గోవిందం’ చిత్రంలో మొదటిసారి కలిసి నటించిన విజయ్ దేవరకొండ, రష్మిక.. ఆ తర్వాత ‘డియర్ కామ్రేడ్’లోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అప్పటి నుంచే ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. ఇప్పుడు సినిమాల్లో కలిసి చేయకపోయినా.. ఆ ఫ్రెండ్‌షిప్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇద్దరూ కలిసి వెకేషన్‌కు వెళ్లిన పిక్స్ కూడా ఆ మధ్య నెట్టింట వైరల్ అయ్యాయి. ఇక విజయ్ ఫ్యామిలీతోనూ రష్మిక చాలా క్లోజ్‌గా మూవ్ అవుతుందని తెలిసిందే. అయితే తమపై సోషల్ మీడియాలో వస్తున్న డేటింగ్ రూమర్స్‌ను ఈ ఆన్‌స్క్రీన్ కపుల్ ఇప్పటికే చాలాసార్లు ఖండించారు. కానీ తాజాగా ఒక ఇన్సిడెంట్ కారణంగా వీరి రిలేషన్‌షిప్ మరోసారి నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.

ఇటీవల రష్మిక చెక్స్ డిజైన్ కలిగిన షర్ట్ ధరించి ఎయిర్‌పోర్టులో కనిపించింది. ఆమె అక్కడి నుంచి వెళ్తున్న క్రమంలో ఫొటోగ్రాఫర్స్‌‌క పోజలు ఇవ్వగా.. ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఎందుకంటే గతంలో సేమ్ షర్ట్‌ ధరించి ఎయిర్‌పోర్ట్‌లో కనిపించాడు విజయ్. దీంతో ఇప్పుడు రష్మిక ధరించిన షర్ట్ విజయ్‌దేనని వాదిస్తున్న నెటిజన్లు.. మొత్తానికి వాళ్లిద్దరి మధ్య రిలేషన్‌షిప్ బయటపడింది అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే ఇద్దరి షర్ట్స్‌లో పోలికలు ఉన్నాయా? లేదంటే విజయ్ తన షర్ట్‌ను రష్మికకు ఇచ్చాడా? క్లారిటీ లేదు. కానీ నెటిజన్లు మాత్రం ఈ మ్యాటర్‌పై నెట్టింట చర్చ మొదలు పెట్టడం విశేషం.

ఇలా తరచూ ఏదో ఒక సందర్భంలో విజయ్, రష్మిక డేటింగ్‌లో ఉన్నట్లు రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. అయితే వాళ్లిద్దరూ తమ కెరీర్స్‌లో బిజీగా ఉన్నారు. ఒక్కొక్కరి ఖాతాలో ఇప్పటికే రెండు మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దీంతో కెరీర్‌పైనే ఫుల్‌గా కాన్సంట్రేట్ చేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈ విషయంపై పూర్తిస్థాయిలో క్లారిటీ రావాలంటే వెయిట్ చేయక తప్పదు.

ఇక విజయ్ విషయానికొస్తే.. ‘ఖుషి’ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. పరశురాం దర్శకత్వంలో ఒక సినిమాతో పాటు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మోహనకృష్ణ ఇంద్రగంటి, దిల్ రాజు కాంబినేషన్‌లో విజయ్‌ హీరోగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ చర్చల దశలో ఉంది. ఇదే క్రమంలో రష్మిక.. ‘యానిమల్, పుష్ప 2’ తదితర చిత్రాలతో బిజీగా ఉంది.

Related posts

హత్య కేసులో ఇద్దరికీ జీవిత ఖైదు

HJNEWS

గోదావరి లంకలు: వరద వస్తే వెళ్లడం, తగ్గితే రావడం…తరతరాలుగా ఇక్కడ ఇదే జీవితం, ఎందుకిలా?

HJNEWS

పవన్ కల్యాణ్ పైన ముద్రగడ పద్మనాభం పోటీకి వైసిపి ప్లాన్?

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్