విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు. సీఎం జాతీయజెండాను ఆవిష్కరించారు. అనంతరం సాయుధ దళాల గౌరవవందాన్ని స్వీకరించారు.. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూ శకటాల ప్రదర్శన జరిగింది. పౌర సేవల్ని ఇంటింటికి తీసుకెళ్లగలిగామని.. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తెచ్చామన్నారు. రాజధానులను మూడు ప్రాంతాల హక్కుగా అమలు చేయబోతున్నామన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ను 2025 జూన్ నాటికి పూర్తి చేస్తామన్నారు. గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటో 50 నెలల్లో చేసి చూపించామన్నారు. ఏ ప్రభుత్వం చేయని గొప్ప మార్పులు చేశామన్నారు. ప్రధానంగా 6 రంగాల్లో వచ్చిన ప్రధానమైన మార్పులు అంటూ ఒక్కో రంగంలో 10 అంశాలను ప్రస్తావించారు.
విజయవాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం జగన్
by HJNEWS
previous post