125 Views
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. స్వాతంత్య్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. గాంధీ భవన్‌లో పార్టీ నేతలందరితో కలిసి జెండా వందనం జరుపుకున్నారు. కాగా.. అనంతరం ఇంటి వద్ద తన మనవడితో (కూతురి కుమారుడు)తో కలిసి ఇండిపెండెన్స్ డే జరుపుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు రేవంత్. తన మనవడు రియాన్ష్‌తో కలిసి మొదటి ఇండిపెండెన్స్ డే జరుపుకున్నానంటూ సంతోషంతో ట్వీట్ చేశారు.