129 Views
మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా పాల్గొన్నారు. పవన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు. అనంతరం జాతీయ గీతాలాపన చేసి జైహింద్ అంటూ నినదించారు. ఈ కార్యక్రమంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో పాటు పలువురు జనసేన నేతలు, వీర మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన వీర మహిళలతో పవన్ భేటీ అయ్యారు.