ఏపీలో కాపు జనాభా అధికంగా ఉన్న లోక్ సభ నియోజకవర్గాల్లో ఒకటైన ఏలూరులో ఈసారి రాజకీయం కాక రేపుతోంది. ఎక్కడా వార్తల్లో కూడా కనిపించకుండా, వినిపించకుండా గుట్టుగాసాగిపోతున్న ఏలూరు ఎంపీ సీటు రాజకీయం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశమవుతోంది.సిట్టింగ్ ఎంపీగా ఉన్న కోటగిరి శ్రీధర్ మరోసారి పోరుకు మొగ్గుచూపడం లేదు. దీంతో ఆయన స్ధానంలో మాజీ మంత్రి ఆళ్లనాని రంగంలోకి దిగనుండగా.. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను చంద్రబాబు రంగంలోకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఏలూరు ఎంపీగా 2019లో గెలిచిన కోటగిరి శ్రీధర్ ఈ నాలుగేళ్లలో తన మార్కు వేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. స్ధానికంగా బలమైన సామాజిక వర్గం కాకపోవడం, తొలిసారి ఎంపీ కావడం, స్ధానికంగా వైసీపీ నేతల నుంచి ఎదురైన ఆంక్షలు ఆయన్ను ఏలూరు ఎంపీ స్ధానంలో రాజకీయం చేసేందుకు ఎక్కడా అవకాశం లేకుండా చేసేశాయి. దీంతో కోటగిరి శ్రీధర్ మరోసారి ఎంపీగా పోటీ చేసేందుకు ఇష్టపడటం లేదని తెలుస్తోంది.అలాగే అధిష్టానం కూడా ఆయన స్ధానంలో మరో ఎంపీ అభ్యర్ధిని సిద్దం చేసుకుంటోంది. మరోవైపు గతంలో ఎంపీగా పలుసార్లు గెలిచి 2019లో ఓటమిపాలైన మాగంటి బాబు స్దానంలో ఎంపీగా కొత్త పేర్లు తెరపైకి వచ్చేస్తున్నాయి.ప్రస్తుతం వైసీపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న కోటగిరి శ్రీధర్ మరోసారి ఎంపీ సీటులో పోటీ చేసే అవకాశాలు దాదాపు కనిపించడం లేదు. గతంలో ఆయన తండ్రి కోటగిరి విద్యాధరరావు పోటీ గెలిచి వరుసగా గెలిచిన చింతలపూడి నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు కావడం, ఆ తర్వాత మారిన ఉంగుటూరు సైతం గెలుపు ఇవ్వకపోవడంతో చివరిగా తన సామాజికవర్గం వెలమదొరల జనాభా ఎక్కువగా ఉన్న నూజివీడువైపు కోటగిరి కన్ను పడుతోంది.
121 Views