Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
ఆంధ్రప్రదేశ్క్రైమ్ వార్తలు

Loan Apps Scam: పేటీఎం ద్వారా డబ్బులు పంపి, మహిళకు చుక్కలు చూపిస్తున్న ఆగంతకులు!

41 Views

Loan Apps Scam: గుర్తు తెలియని వ్యక్తుల పేటీఎం నుంచి ఓ మహిళ పేటీఎంకు డబ్బులు వచ్చాయి. మిస్ అయి వచ్చాయనుకొని ఆ డబ్బులను అదే నెంబర్ కు తిరిగి పంపించాారు. అదే ఆమె పాలిట శాపంగా మారింది.

Loan Apps Scam: ఆన్ లైన్ లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. ఇప్పటి వరకు లోన్ యాప్ లను సంప్రదించి అప్పు తీసుకున్న వారినే వేధించిన సంఘటనలు చూశాం. కానీ తూర్పు గోదావరి జిల్లా కడియంలో సరికొత్త లోన్ యాప్ వేధింపుల ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే… కడియం మండలంలో నివాసం ఉండే దేవి అనే మహిళ నిన్న దిశా ఎస్ఓఎస్ కు కాల్ చేసి తనను లోన్ యాప్ నిర్వాహకుడు వేధిస్తున్నట్టుగా సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో బాధితురాలి ఇంటికి వెళ్లిన దిశ పోలీసులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని రోజుల కిందట గుర్తు తెలియని నెంబర్ నుండి తనకు 2000 రూపాయలు ఫోన్ పే ద్వారా వచ్చాయని.. అది గమనించి వెంటనే అదే నెంబర్ కు అమౌంట్ తిరిగి పంపించినట్లు తెలిపారు

అప్పటి నుండి అదే నెంబర్ నుండి వాట్సాప్ కాల్ చేసిన వ్యక్తి హిందీ, ఇంగ్లీషులో మాట్లాడుతూ వేధింపులకు పాల్పడుతున్నట్లు బాధితురాలు వాపోయారు. అదనంగా డబ్బులు చెల్లించాలని లేదంటే తన ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బాధితురాలిని బెదిరించాడు. ఆగంతకుడు చెప్పిన విధంగానే బాధితురాలి ఫోటోలను మార్ఫింగ్ చేసి న్యూడ్ ఫోటోలను పంపించడం మొదలు పెట్టాడు. ఆగంతకుడి ఆకృత్యాలు శృతిమించడంతో బాధితురాలు దిశా పోలీసులకు కాల్ చేసి సమాచారం ఇచ్చారు.

బాధితురాలు దేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దిశా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆగంతకుడు కాల్ చేసిన ఫోన్ నెంబర్, ఇతర వివరాల ఆధారంగా కడియం పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. అజ్ఞాత వ్యక్తులు ఎవరైనా ఫోన్ చేసి వేధింపులకు పాల్పడితే వెంటనే దిశ ఎస్ఓఎస్ కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు పోలీసులు సూచించారు.

Related posts

చిరంజీవి మోకాలికి శస్త్ర చికిత్స పూర్తి.. ‘నీ వాష్’ చేసిన వైద్యులు

HJNEWS

ఇలా చేస్తున్నారా? మీ వాట్సాప్ హ్యాక్ అయినట్లే.. తప్పక తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది..!

HJNEWS

ది మోస్ట్ స్టైలిష్‌గా విజయ్.. ఖుషి టైటిల్ సాంగ్ వైరల్

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్