Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
ఆంధ్రప్రదేశ్

బీఆర్ఎస్ కు షాక్… కాంగ్రెస్ లోకి ఆ బీఆర్ఎస్ కీలక నేత

150 Views

బీఆర్ఎస్ కు షాక్… కాంగ్రెస్ లోకి ఆ బీఆర్ఎస్ కీలక నేత
బీఆర్ఎస్‌కు కీలక నేత తీగల కృష్ణారెడ్డి గుడ్‌బై: రేవంత్ రెడ్డితో భేటీ, కాంగ్రెస్‌లోకి

హైదరాబాద్ : గత కొంత కాలంగా అధికార పార్టీ వైఖరిపై అసంతృప్తితో ఉన్న బీఆర్ఎస్ కీలక నేత, మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

తన కోడలు, రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ అనితా రెడ్డితో కలిసి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్ రావు ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని తీగల కృష్ణారెడ్డి సమావేశమయ్యారు.

తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన తీగల కృష్ణారెడ్డి.. గతంలో హైదరాబాద్ మేయర్‌గా కూడా పనిచేశారు. హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(హుడా) ఛైర్మన్‌గానూ పనిచేశారు.

2019లో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం ఏర్పడినప్పుడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.

2014లో కాంగ్రెస్ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డిపై టీడీపీ తరపున పోటీ చేసిన గెలిచిన తీగల కృష్ణారెడ్డి.. ఆ తర్వాత అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే, 2018లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సబితా ఇంద్రారెడ్డి చేతిలో తీగల ఓడిపోయారు.

ఈ క్రమంలో సబితా ఇంద్రారెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవి దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో సబిత, తీగల మధ్య తరచూ ఆధిపత్య పోరు నెలకొంటోంది. బీఆర్ఎస్ నుంచి తనకు టికెట్ వస్తుందో లేదో అనే సందేహం తీగల మదిలో మెదలుతోంది.

పార్టీలో కూడా తనకు ప్రాధాన్యత తగ్గుతూ వస్తోందని తీగల మదనపడుతున్నారు. సిట్టింగ్‌లకే బీఆర్ఎస్ టికెట్ ఇచ్చే అవకాశముందని సంకేతాలు పార్టీ నుంచి రావడంతో ఇక పార్టీలో ఉండటం కూడా లాభం లేదని ఆయన భావిస్తున్నారు.

కర్ణాటక రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావడంతో తెలంగాణలోనూ ఆ పార్టీ జోరు పెంచింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు లాంటి సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో తాను కూడా ఆ పార్టీలో చేరాలని తీగల కృష్ణారెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే మాణిక్ రావు ఠాక్రే, రేవంత్ రెడ్డిలను తీగల కలిశారు. మహేశ్వరం జడ్పీటీసీగా గెలిచి రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్‌గా ఉన్న కోడలు అనితా రెడ్డితో కలిసి తీగల కాంగ్రెస్ పార్టీలో త్వరలోనే చేరనున్నట్లు తెలుస్తోంది.

తీగల చేరికకు కాంగ్రెస్ పార్టీ కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. దీంతో అధికార పార్టీలో కీలక నేతగా ఉన్న తీగల కాంగ్రెస్ పార్టీలో చేరితే.. మహేశ్వరంలో గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంటుంది.

Related posts

హైదరాబాద్ – విజయవాడ హైవేపై మున్నేరు వరద.. క్రేన్‌తో విద్యార్థుల తరలింపు

HJNEWS

హత్య కేసులో ఇద్దరికీ జీవిత ఖైదు

HJNEWS

చిలకలూరి పేటలో భారీసభ.. బస్సులు కావాలి..

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్