రామ్ గోపాల్ వర్మ షేర్ చేసే ఫోటోలు, పెట్టే కామెంట్లు ఎంతటి కాంట్రవర్సీకి దారి తీస్తుంటాయో అందరికీ తెలిసిందే. ఆ మధ్య అషూ రెడ్డి కాలి వేళ్లని నాకుతూ ఇంటర్వ్యూలో నానా హంగామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మళ్లీ అలాంటి ఓ పనే చేశాడు వర్మ. ఇక మరో వైపు ఛార్మీ ఫ్రెండ్ షిప్ డే అంటూ చీర్స్ కొడుతోంది.
రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో చేసే సందడి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. రొమాంటిక్ ఫోటోలు షేర్ చేయడంలో వర్మ ముందుంటాడు. ఇక వర్మ అప్పట్లో చేసిన ఇంటర్వ్యూలు, అందులో వేసిన వేషాలు ఎంతగానో వైరల్ అయ్యాయి. వర్మ తీసే సినిమాలు, చేసే ఇంటర్వ్యూలు కాంట్రవర్సీలో చిక్కుకోవడం సర్వసాధారణం అన్న సంగతి తెలిసిందే. తాజాగా వర్మ వేసిన పోస్ట్, ఛార్మీ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతున్నవర్మ ఇప్పుడు ఎలాంటి సినిమాలు తీస్తున్నాడో అందరికీ తెలిసిందే.
ఇక మరో వైపు పూరి ఫ్రెండ్ ఛార్మీ ఫారిన్‌లో ఎంజాయ్ చేస్తోంది. ఛార్మీతో పాటుగా పూరి ఉన్నాడో లేదో తెలియడం లేదు. సినిమా షెడ్యూల్ కోసమే వెళ్లినట్టుగా టాక్ వినిపిస్తోంది. అయితే రామ్ ఇక్కడే ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. ఇదంతా ఎలా ఉన్నా కూడా ఛార్మీ మాత్రం ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉంది. ఫ్రెండ్ షిప్ డేను సెలెబ్రేట్ చేసుకుంటోంది. వోడ్కా బాటిల్ ముందు పెట్టుకున్నట్టుగా ఉంది.. చీర్స్ చెబుతున్నట్టుగా పోస్ట్ పెట్టింది ఛార్మీ
అటు ఆర్జీవీ ఫోటో, ఇటు ఛార్మీ ఫోటో రెండూ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే పూరి ఎక్కడున్నాడు? అనే ప్రశ్న కూడా నెట్టింట్లో వినిపిస్తోంది. డబుల్ ఇస్మార్ట్‌ను శర వేగంగా పూర్తి చేయాలని పూరి భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది. లైగర్ డిజాస్టర్ తరువాత చాలా రోజులు సైలెంట్ అయిపోయాడు. తన కొడుకు ఆకాష్ సినిమా ప్రమోషన్స్‌కి కూడా అంతగా రాలేదన్న సంగతి తెలిసిందే. చివరకు రామ్‌తో డబుల్ ఇస్మార్ట్ ప్రారంభించాడు. హీరోయిన్ల వేట ఇంకా కొనసాగుతున్నట్టుగా సమాచారం. అందులో ఓ హీరోయిన్‌గా బేబి వైష్ణవిని తీసుకుంటున్నట్టుగా పుకార్లు వస్తున్నాయి..
వర్మ తీస్తోన్న సినిమాల కంటే ఆయన ట్విట్టర్లో చేసే హంగామా గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇక ఆర్జీవీ తాజాగా ఫోటోలు షేర్ చేశాడు. ఆ పోటోలో ఉన్నది ఎవరు? ఆ కాలు ఎవరిది? అనేది బయటకు చెప్పలేదు. కానీ ఆమె కాలిని, పాదాన్ని నాకుతున్నట్టుగా పోజులు అయితే పెట్టాడు. ఇక అర్దరాత్రి పూట ఓ పెగ్గు వేసి ఇలాంటి వేషాలు వేస్తుంటాడని నెట్టింట్లో అందరూ కామెంట్లు పెడుతుంటున్నారన్న సంగతి తెలిసిందే.