Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
ఆంధ్రప్రదేశ్సినిమా వార్తలు

సింగపూర్ వీధుల్లో బిగ్ బాస్ బ్యూటీ అందాల మోత.. బాబోయ్ ఏంటీ డ్రెస్సు!!

108 Views

యాషికా ఆనంద్ అందాలు ఆరబోయడం కొత్తేమీ కాదు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసే ప్రతి ఫొటో, వీడియో తన ఫాలోవర్స్‌ను పిచ్చెక్కించేలానే ఉంటాయి. అయితే, తాజాగా ఆమె పోస్ట్ చేసిన వీడియో మాత్రం ఫ్యాన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. దానికి కారణం ఆమె వేసుకున్న డ్రెస్

.సినీ తారలు, టెలివిజన్ బ్యూటీలకు ఇన్‌స్టాగ్రామ్‌ అనేది ఒక గొప్ప ప్లాట్‌ఫాం. ఈ ఫ్లాట్‌ఫాంలో వాళ్లకు ఎంత ఎక్కువ మంది ఫాలోవర్లు ఉంటే అంత గొప్ప. మరీ ముఖ్యంగా పెద్దగా సినిమా అవకాశాలు లేని తారలకు అయితే ఇన్‌స్టాగ్రామ్ మరో అద్భుతమైన ఇండస్ట్రీ. ఇక్కడి నుంచే రోజూ ఫాలోవర్లతో టచ్‌లో ఉంటారు.. వాళ్లను ఊరిస్తూ హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు పెడుతుంటారు. ఇలాంటి తారల అందాలను వీక్షిచేందుకు వాళ్లను నెటిజనులు తెగ ఫాలో అయిపోతూ ఉంటారు. అలా ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీతంగా ఫాలోయింగ్ ఉన్న నటీమణుల్లో యాషికా ఆనంద్ ఒకరు

యాషికా ఆనంద్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఎటు చూసినా అందమే.. కళ్లను ఆనందమే. రోజూ ఒక హాట్ ఫొటోషూట్ కచ్చితంగా ఆమె పోస్టు చేస్తూ ఉంటుంది. దీనికి తోడు విదేశాలకు విహారయాత్రలకు వెళ్లినప్పుడు అక్కడ బీచుల్లో, వీధుల్లో తీసుకున్న హాట్ ఫొటోలు, వీడియోలు కూడా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తుంటుంది. ఈ ఫొటోలకు, వీడియోలకు విపరీతమైన ఫాలోయింగ్. అందుకే, ఆమెకు ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో 4 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.

అయితే, తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో యాషికా ఆనంద్ పోస్ట్ చేసిన ఫొటోలు, వీడియో బాగా వైరల్ అవుతున్నాయి. దీనికి కారణం ఆమె వేసుకున్న డ్రెస్. ప్రస్తుతం సింగపూర్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న యాషికా.. అక్కడ తీసుకున్న ఫొటోలు, వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. బూడిద రంగుకు అటూఇటూగా ఉన్న రంగులో ఒంటికి గట్టిగా పట్టుకున్న ఒక బుల్లి డ్రెస్ వేసుకున్న యాషికా.. వయ్యారాలు ఒలికిస్తూ వీడియో తీయించుకుంది. ఇది చూసిన ఆమె ఫాలోవర్లు పిచ్చెక్కిపోతున్నారు. ఇదేం అందం తల్లో అంటూ కామెంట్లు పెడుతున్నారు.

యాషికా ఆనంద్ రెండేళ్ల క్రితం కారు యాక్సిడెంట్‌కు గురైంది. ఫ్రెండ్స్‌తో కలిసి కారులో వెళ్తుండగా మహాబలిపురం దగ్గరలో యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో ఆమె స్నేహితురాలు భవాని ప్రాణాలు కోల్పోగా.. యాషికాకు, మరో ఇద్దరు స్నేహితురాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. యాషికాకు పలు శస్త్రచికిత్రలు చేశారు. చాలా రోజులు ఐసీయూలో ఉంది. దీంతో సినిమాల నుంచి ఆమె కాస్త గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. గాయం నుంచి కోలుకోవడంతో మళ్లీ తన కెరీర్‌లో బిజీ అవుతోంది ఈ బ్యూటీ.

ఢిల్లీ నుంచి చెన్నైకి వచ్చి అక్కడే మకాం వేసిన యాషికా ఆనంద్.. తమిళ పలు తమిళ సినిమాల్లో నటించింది. ఆమె చేసినవన్నీ చిన్న చిన్న పాత్రలే. అయితే, తమిళ బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొనడం ద్వారా యాషికా ఆనంద్‌కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. బిగ్ బాస్ షోలో ఆమె అందాల ఆరబోత అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. 98 రోజుల పాటు ఆమె హౌస్‌లో ఉండి తమిళ ఆడియన్స్‌కు చేసిన కనువిందు అంతా ఇంతా కాదు. ఇదే ఊపుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె అందాల ఆరబోత మొదలుపెట్టింది.

ప్రస్తుతం యాషికా చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. వాటిలో ‘ఇవాన్ థాన్ ఉత్తమన్’, ‘రాజా భీమ’, ‘బంపట్టమ్’, ‘చైత్ర’ సినిమాలు ఉన్నాయి. ‘చైత్ర’ సినిమాలో యాషికా ఆనంద్‌ దెయ్యంగా నటిస్తుంది. ఇది హారర్ థ్రిల్లర్‌ మూవీ.

Related posts

NBK 109​ ఆ హీరోయిన్​కు బాలయ్య సర్​ప్రైజ్… సెట్స్​లో సెలబ్రేషన్స్​తో రచ్చ రచ్చ

HJNEWS

ఎన్టీఆర్ జిల్లా: రోగి ప్రాణాలు కాపాడేందుకు 108 డ్రైవర్ సాహసం.. బ్రిడ్జిపై వరద నీళ్లు ఉన్నాసరే!

HJNEWS

సినీ ఫక్కీలో లంచావతారం పట్టివేత.. నడిరోడ్డుపై ట్రాప్.. ట్రెండ్‌ మార్చిన ఏసీబీ!

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్