Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
ఆంధ్రప్రదేశ్

ఏపీ దేశానికే ఆదర్శంగా నిలిచింది.. 50 నెలల్లోనే గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చాం: సీఎం జగన్

81 Views

ఏపీ వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసు బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. వివిధ ప్రభుత్వ పథకాలపై ఆయా శాఖలు ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శనను సీఎం తిలకించారు. గాంధీజీ ఇచ్చిన అహింస, శాంతి సందేశాన్ని.. భగత్‌సింగ్‌, సుభాష్‌ చంద్రబోస్‌ సాహసాన్ని.. టంగుటూరి, అల్లూరి, పింగళి త్యాగనిరతిని.. లక్షలాది సమరయోధుల బలిదానాన్ని గుర్తుచేస్తూ జాతీయ జెండా ఎగురుతోంది అన్నారు. ఈ జెండాకు రాష్ట్ర ప్రజల తరఫున సెల్యూట్‌ చేశారు.

విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. సాయుధ దళాలు గౌరవ వందనాన్ని స్వీకరించారు. ప్రత్యేక వాహనంపై సీఎం పరేడ్‌ను పరిశీలించారు. సాయుధ దళాలు, కంటింజెంట్లు కవాతు నిర్వహించాయి.. 13 అభివృద్ధి శకటాల పేరుతో ప్రదర్శన నిర్వహించారు. ఈ నాలుగేళ్లలో వ్యవసాయం, విద్య, వైద్యం , మహిళ సాధికారత, సామాజిక న్యాయం, పారిశ్రామిక రంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చామన్నారు.

గత నాలుగేళ్లుగా అర్హులందరికి పథకాలు అందించిన ఏకైక ప్రభుత్వం తమదే అన్నారు సీఎం జగన్. గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని మార్పులు తెచ్చామన్నారు. సంక్షేమ పథకాలన్నీ అక్కచెల్లెమ్మల పేరు మీదే ఇస్తున్నామని.. 2 లక్షల 31 వేల కోట్లను నేరుగా ప్రజలకు అందించామన్నారు. ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా పేదలకు సంక్షేమ పథకాలు అందజేస్తున్నామన్నారు. పేదలకు ఇళ్లు ఇవ్వకూడదని అడ్డుకోవడం కూడా అంటరానితనమే అన్నారు. పేదల సహనాన్ని పరీక్షించడం కూడా అంటరాని తనమేనని.. పేదలు గెలిచే వరకూ, వారి బతుకులు బాగుపడే వరకూ యుద్ధం కొనసాగుతుందన్నారు.

గ్రామ సచివాలయాలు, ఆర్బీకే కేంద్రాలతో గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చామన్నారు. ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేదన్నారు. అన్ని సేవలు ఇంటి వద్దకే అందిస్తున్నామన్నారు. 50 నెలల్లో గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చామన్నారు సీఎం. గ్రామాల్లో విలేజ్‌ క్లినిక్‌లు, డిజిటల్‌ లైబ్రరీలు ఏర్పాటు చేశామని.. పౌర సేవల్ని ఇంటింటికి తీసుకెళ్లగలిగామన్నారు. రైతులకు పెట్టుబడి కోసం రైతు భరోసా అందిస్తున్నామని గుర్తు చేశారు. విత్తనం నుంచి అమ్మకం వరకూ రైతుకు అండగా నిలుస్తున్నామన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన సేవలు అందుతున్నాయన్నారు. రైతులను ఆదుకునేందుకు పంటల బీమా అమలు చేస్తున్నామన్నారు.

పేదలు చదివే స్కూళ్లను పాడుబడేలా చేయడం అంటరానితనమన్నారు. పేదలు ఇంగ్లీష్‌ మీడియాం చదువుకోవద్దని వాదించడం అంటరానితనమే అన్నారు. పేదలు వైద్యం చేయించుకునే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత సేవలు అందకుండా చేయడం కూడా అంటరానితనమే అని వ్యాఖ్యానించారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా తీసుకొని అన్ని హామీలను అమలు చేశామన్నారు. విద్యావ్యవస్థలో పలు సంస్కరణలు అమలు చేస్తున్నామన్నారు. నాడు-నేడుతో 45 వేల ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్పులు తీసుకొచ్చామన్నారు. గవర్నమెంట్‌ స్కూళ్లలో ఇంగీష్‌ మీడియం అమలు చేశామని.. 3వ తరగతి నుంచే సబ్జెక్ట్‌ టీచర్‌ విధానం..

పాలనలో ఏ ప్రభుత్వం చేయని మార్పులు తీసుకొచ్చామని.. 98.5 శాతం వాగ్దానాలను అమలు చేశామన్నారు. విద్యార్థుల భోజనం, వసతి ఖర్చుల కోసం రూ.20 వేల వరకు వసతి దీవెన అందిస్తున్నామన్నారు. రోజుకో మెనూతో పౌష్టికాహారంగా గోరుముద్ద అందిస్తున్నామన్నారు. డిగ్రీ స్థాయిలో 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్.. ట్రిపుల్‌ ఐటీల్లో పెండింగ్‌లో ఉన్న 3295 టీచింగ్‌ పోస్టుల భర్తీ చేశామన్నారు.

సామాజిక న్యాయం నినాదం కాకుండా.. దాన్ని అమలు చేసి చూపామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చామని.. వికేంద్రీకరణతో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించామన్నారు. కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేశామని.. అంటరానితనం మీద యుద్ధాన్ని ప్రకటించామన్నారు. శాశ్వత బీసీ కమిషన్‌ను నియమించిన తొలి రాష్ట్రంగా ఏపీ నిలిచిందన్నారు. 139 బీసీ కులాలకు 56 ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు. 50 నెలల్లో డీబీటీ ద్వారా రూ. 2.31 లక్షల కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. 2 లక్షల 6 వేల 638 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేశామన్నారు.

వైద్యశాఖలో ఏకంగా 53, 126 పోస్టుల భర్తీ చేశామన్నారు. రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికలు కాలేజీలు నిర్మిస్తున్నామని.. 108, 104 సేవల కోసం కొత్తగా 1514 వాహనాల కొనుగోలు చేశామన్నారు. పాల వెల్లువ ద్వారా పాడి రైతులకు అదనంగా ఆదాయం వచ్చేలా చేశామన్నారు. మూతపడిన చిత్తూరు డైరీకి జీవం పోశామని.. భూవివాదాలకు పరిష్కారం కోసం సమగ్ర సర్వే చేపట్టామన్నారు. వికేంద్రీకరణలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించామన్నారు. రాష్ట్రంలో కొత్తగా 4 పోర్టుల నిర్మాణం ప్రారంభించామని.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు కొనసాగుతున్నాయన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌బిజినెస్‌లో వరుసగా మూడేళ్లు ఏపీ నంబర్‌వన్‌ అన్నారు.

రాష్ట్రంలో కొత్తగా 127 భారీ పరిశ్రమల ఏర్పాటు చేశామని.. రాష్ట్రానికి వచ్చిన పెట్టబడులు రూ. 67, 196 కోట్లు అని తెలిపారు. గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో రూ. 13. 42 లక్షల కోట్లకు ఎంవోయూలు జరిగాయన్నారు. ప్రాధాన్య క్రమంలో ప్రాజెక్టులను పూర్తిచేస్తున్నామని.. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. వంశధార ఫేజ్‌-2, వంశధార- నాగావళి అనుసంధానం పనులు చేపట్టామన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని.. 2025 జూన్‌ నాటికి పోలవరం పూర్తిచేస్తామన్నారు. వెలుగొండ మొదటి టన్నెల్‌ పూర్తిచేశాం.. రెండో టన్నెల్‌ పనులు త్వరలోనే పూర్తవుతాయన్నారు. గతంలో ఏ ప్రభుత్వమూ అమలు చేయని గొప్ప మార్పు ఇది అన్నారు ముఖ్యమంత్రి.

Related posts

HJNEWS

చిరంజీవి మోకాలికి శస్త్ర చికిత్స పూర్తి.. ‘నీ వాష్’ చేసిన వైద్యులు

HJNEWS

వాలంటీర్లకు తాజా ఆఫర్..ఉద్యోగం కొనసాగాలంటే…?

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్