Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
ఆంధ్రప్రదేశ్

ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి ముఖ్య గమనిక.. దుష్ప్రచారాన్ని నమ్మొద్దు, అసలు సంగతి ఇది!

104 Views

ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి ముఖ్యమైన గమనిక. కొద్దిరోజులుగా రేషన్ పంపిణీ వాహనాలపై జరుగుతున్న ప్రచారంపై పౌరసరఫరాలశాఖ స్పందించింది. దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని కోరారు. ఒకవేళ వాహనం రాని పక్షంలో టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఒకవేళ ఎవరైనా ఎండీయూ ఆపరేటర్లు లేకపోయినా సరే.. రేషన్ పంపిణీ మాత్రం ఆగడం లేదన్నారు. రేషన్ పంపిణీలో ఎలాంటి అవకతవకలకు అవకాశమే లేదంటున్నారు. ఏపీలో రేషన్‌ కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం అలర్ట్ చేసింది. ఇంటింటికి రేషన్‌ పంపిణీ విధానాన్ని వివిధ స్థాయిల్లో తనిఖీ చేస్తున్నామని పౌర సరఫరాలశాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ అన్నారు. కొందరు రేషన్ పంపిణీ, ఎండీయూ వాహనాలపై జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. ఎక్కడైనా ఇంటి దగ్గరకు వాహనం రాకపోతే 1967 టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయొచ్చన్నారు. గత 6 నెలల్లో 126 మొబైల్‌ వాహన ఆపరేటర్లను శాశ్వత ప్రాతిపదికన నియమించామని తెలిపారు. ఇంకా 284 చోట్ల ఖాళీలు ఉన్నాయని.. అలాంటి చోట్ల తాత్కాలిక ఆపరేటర్లను నియమించి నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నామన్నారు. చౌక దుకాణాల ద్వారా ఎలాంటి సరకులనూ పంపిణీ చేయడం లేదన్నారు.

ఎండీయూ వాహనం ద్వారా రేషన్ కార్డులు ఉన్నవారికి ఇంటి దగ్గరే సంచులు తెరిచి కచ్చితమైన తూకంతో ఇస్తుండటంతో కొలతలపై ఫిర్యాదులు లేవన్నారు. ఈ–పోస్‌ యంత్రాలకు జీపీఎస్‌ ట్రాకింగ్‌ అమర్చడంతో అక్రమ రవాణాకు తావులేదంటున్నారు. ఎండీయూ వాహనాలు క్రమం తప్పకుండా నిర్దేశించిన ప్రాంతాలకు వెళ్లేలా సెంట్రల్‌ కమాండ్‌ కంట్రోల్‌ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తోంది.

అంతేకాదు అధికారులు ప్రతి రోజూ తనిఖీలు చేయడంతో పాటు 1967 టోల్‌ ఫ్రీ నంబర్‌ను ఎండీయూలపై ముద్రించి లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. గత ఆరు నెలలో 128 ఫిర్యాదులు రాగా వెంటనే పరిష్కరించారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో విజిలెన్సు కమిటీలను ఏర్పాటు చేసి నిత్యం రేషన్‌ డోర్‌ డెలివరీ విధానాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇంటింటికీ రేషన్‌ చేరకపోతే వెంటనే ఫిర్యాదు చేసే సౌకర్యం కూడా ఉంది.

ఎక్కడైనా ఎండీయూ ఆపరేటర్‌ సెలవులో ఉన్నా, అనివార్య కారణాలతో రాకపోయినా వీఆర్వో ద్వారా లబ్దిదారుల ఇంటి దగ్గరే సరుకులు పంపిణీ చేసేలా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ఎండీయూ వాహన ఆపరేటర్ల ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయడంతో పాటు లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా తాత్కాలిక ప్రాతిపదికపైన నియమించి నిత్యావసరాలను సరఫరా చేస్తున్నారు. ఎండీయూ వాహనం ఎప్పుడు ఏ వీధికి వస్తుందో ముందుగానే వాలంటీర్ల ద్వారా సమాచారాన్ని అందిస్తున్నారు.

కార్డు ఉన్నవారికి కుటుంబ సభ్యుల్లో ఎవరు అందుబాటులో ఉన్నా వేలిముద్ర ద్వారా రేషన్‌ తీసుకునే సౌకర్యాన్ని కల్పించారు. గత ఆర్నెల్లలో 126 ఎండీయూ ఆపరేటర్లను శాశ్వత ప్రాతిపదికన నియమించగా మరో 284 చోట్ల తాత్కాలిక విధానంలో తీసుకుని సరుకులు సరఫరా చేస్తున్నారు. అంతేకాదు ప్రతి నెలా 17లోగా రేషన్‌ పంపిణీ పూర్తవుతుంది. ఏటా వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం ద్వారా ఇన్సూరెన్స్‌ భారాన్ని తగ్గిస్తున్నారు. ఎండీయూ ఆపరేటర్లకు సమానంగా రేషన్‌ కార్డులను కేటాయించి ప్రతి నెలా వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నారు.

Related posts

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. వాతావరణం అప్‌డేట్

HJNEWS

గోదావరి లంకలు: వరద వస్తే వెళ్లడం, తగ్గితే రావడం…తరతరాలుగా ఇక్కడ ఇదే జీవితం, ఎందుకిలా?

HJNEWS

గోదావరి పందెం కోడి కోసం థాయ్‌లాండ్ నుంచి వచ్చారు.. ఆ పుంజుకు అంత క్రేజా!

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్