Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
JANASENAYSRCPఆంధ్రప్రదేశ్

పవన్ కల్యాణ్ పైన ముద్రగడ పద్మనాభం పోటీకి వైసిపి ప్లాన్?

ఏపీ రాజకీయాలు బాగా వేడెక్కుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెలలో ఎప్పుడైనా రిలీజ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. దీనితో గెలుపు గుర్రాల పైన ఆయా పార్టీలు ఫోకస్ పెట్టాయి. ఇటీవలే జనసేన 24 సీట్లలో పోటీ చేస్తుందని పవన్ ప్రకటించడంతో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాసారు. కనీసం 80 సీట్లు తీసుకుంటారని, రెండున్నరేళ్లు సీఎం పదవి తీసుకుంటారని ఊహిస్తే ఎందుకూ పనికిరాని నిర్ణయం తీసుకున్నారని దుయ్యబట్టారు

మరోవైపు ఆ లేఖతో జనసేనాని పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు. పిఠాపురంలో తనపై పోటీ చేసి విజయం సాధించాలంటూ ముద్రగడకు సవాల్ విసిరారు. ఈ నేపధ్యంలో పాలక పార్టీ వైసిపి ముద్రగడపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు కీలక నాయకులను ముద్రగడ ఇంటికి పంపించి మంతనాలు జరిపినట్లు సమాచారం. ముద్రగడ అంగీకరిస్తే ఆయనను పిఠాపురం నుంచి పోటీ చేయించాలని అనుకుంటున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Related posts

గన్నవరం నుంచే పోటీ చేస్తానంటున్న యార్లగడ్డ వెంకట్రావు.. టీడీపీలో చేరికపై ఏమన్నారంటే

HJNEWS

ఏపీలో రేపటి నుంచే పెన్షన్లు ! కొందరికే ఇంటికి-మిగతా వాళ్లకు అక్కడే..!

HJNEWS

ది మోస్ట్ స్టైలిష్‌గా విజయ్.. ఖుషి టైటిల్ సాంగ్ వైరల్

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్