Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
తెలంగాణరాజకీయం

చిరంజీవి బాటలో వైఎస్ షర్మిల.. అంతా సెట్ రైట్ అయినట్లేనా?

108 Views

కాంగ్రెస్ పార్టీలో వైఎస్సాఆర్‌టీపీ విలీనం అంశంపై మరోసారి తెరపైకి వచ్చింది. షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే అంశంపై ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే పార్టీలో ప్రాధాన్యత, పోటీ చేసే స్థానంపై కాంగ్రెస్ అదిష్ఠానంతో చర్చించినట్లు సమాచారం. మరో వారం పదిరోజుల్లోనే పార్టీ విలీనం ఉంటుందని పొలిటికల్ సర్కిల్‌లో చర్చ జరుగుతోంది.

తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపనే తన లక్ష్యమంటూ వైఎస్ షర్మిల పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. తానూ తెలంగాణ బిడ్డేనని. వైఎస్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావటమే తన ప్రధాన లక్ష్యమంటూ వైఎస్సాఆర్‌టీపీ పేరుతో ఆమె పార్టీని నెలకొల్పారు. ఆ తర్వాత.. తండ్రి సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ.. చేవెళ్లలో పాదయాత్రను ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా 3800 కిలోమీటర్ల మేర నడిచారు. ఈ క్రమంలో కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దూకుడుగా వ్యవహరిస్తూ.. బీఆర్ఎస్‌పై నిప్పులు చెరిగారు. పార్టీ బలోపేతపై దృష్టి సారించారు.

అయితే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీ తిరిగి రేసులోకి వచ్చింది. బీఆర్ఎస్‌ను ఎదుర్కొనే సత్తా తమకే ఉందని కాంగ్రెస్ నేతలు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ గత కొంత కాలంగా ప్రచారం జరగుతోంది. అందుకు బలం చేకూర్చేలా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్‌తో పలుమార్లు ఆమె భేటీ అయ్యారు. తన పార్టీలోకి పొంగులేటి వంటి నేతలు వస్తారని ఆశించినా.. అది జరగకపోటవం, పార్టీ రోజు రోజుకు బలహీన పడుతుండటంతో షర్మిల కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ నేత కేవీపీ కూడా షర్మిలను పార్టీలోకి ఆహ్వానించారు. ఆమెకు కాంగ్రెస్‌తో వీడదీయలేని బంధం ఉందని చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలో కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనం వ్యవహారం క్రమంగా కొలిక్కి వస్తున్నట్లు సమాచారం. షర్మిలకు కాంగ్రెస్‌ పార్టీలో ఏ పదవి ఇవ్వాలి ? ఎక్కడ నుంచి ఆమెను పోటీకి దింపాలన్నదానిపై ఏకాభిప్రాయం రాగానే విలీన ప్రక్రియ మొదలు కానున్నట్లు సమాచారం. ఈనెల 12నే విలీనం కానున్నట్లు వార్తలు వస్తున్నా.. మరో వారం పది రోజుల్లో అంతా కొలిక్కి రానుందని రాహుల్‌ సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరటం ఖాయమని ప్రచారం జరుగుతోంది.

పార్టీలో హోదాకు సంబంధించి ఏఐసీసీ కార్యవర్గంలోకి ఆమెను తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే తాను తెలంగాణ నుంచే ప్రాతినిధ్యం వహిస్తానంటూ షర్మిల స్పష్టం చేస్తున్న నేపథ్యంలో.. ఆమెను ఎక్కడి నుంచి పోటీ చేయించాలనే దానిపై కాంగ్రెస్ పార్టీ కన్ఫ్యూజన్‌లో పడింది. పాలేరు నుంచే పోటీ చేస్తానంటూ షర్మిల చెబుతుండగా.. సికింద్రాబాద్‌ స్థానం నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. అయితే తెలంగాణలో షర్మిల ప్రాతినిధ్యాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ సహా పలువురు నేతలు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ఆమె పార్టీ విలీనంపై సస్పెన్స్ కొనసాగుతోంది.

ఉమ్మడి ఏపీలో 2008లో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 2009 ఎన్నికల్లో ఆ పార్టీ 18 స్థానాల్లో విజయం సాధించింది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరస్థితుల దృష్ట్యా.. తన పార్టీకి స్పేస్ లేదని భావించిన చిరంజీవి 2011లో పీఆర్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. రాజ్యసభకు ఎంపికై కేంద్రమంత్రిగానూ వ్యవహరించారు. ఆ తర్వాత రాజకీయాలకు శాశ్వతంగా దూరమయ్యారు. షర్మిల కూడా చిరంజీవి బాటలోనే ఇక్కడ పొలిటికల్ స్పేస్ లేదని భావించి వైఎస్సాఆర్‌టీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు సిద్ధమైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Related posts

‘తెర వెనుక ఉంది చిరంజీవే.. భార్యల బంగారం అమ్ముకున్నారు’

HJNEWS

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్.. దసరాకు అదిరే కానుక, వారికి 5 సీఎల్స్!

HJNEWS

ఏపీలో అహా క్యాంటీన్లు.. ప్రభుత్వం కొత్త స్కీమ్.. భోజనం ఎంతంటే..!

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్