Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
ఆంధ్రప్రదేశ్రాజకీయం

ఏపీలో అహా క్యాంటీన్లు.. ప్రభుత్వం కొత్త స్కీమ్.. భోజనం ఎంతంటే..!

121 Views

ఏపీలో అహా క్యాంటీన్లు.. ప్రభుత్వం కొత్త స్కీమ్.. భోజనం ఎంతంటే..!
పేదలకు తక్కువ ధరకే ఆహారం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. గతంలో ఉన్న అన్నా క్యాంటీన్ల మాదిరిగానే కొత్త ఐడియాను అమలు చేయబోతోంది.
పేదలకు తక్కువ ధరకే ఆహారం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. గతంలో ఉన్న అన్నా క్యాంటీన్ల మాదిరిగానే కొత్త ఐడియాను అమలు చేయబోతోంది.

అన్నా క్యాంటీన్ల తరహాలోనే ఏపీలో కొత్త క్యాంటీన్లు మొదలవుతున్నాయి. అది కూడా డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో ప్రభుత్వం ఈ క్యాంటీన్లన ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా కొన్ని జిల్లాల్లో ప్రారంభించింది.

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకురాబోయే క్యాంటీన్ల పేరు ఆహా క్యాంటీన్లు. పట్టణాల్లోని స్వయంగా సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఈ క్యాంటీన్లు నడుస్తాయి. ఈ క్యాంటీన్ల అంశాన్ని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా చూస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా 110 మున్సిపాలిటీల్లో 140 క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా ఆస్పత్రులు, బస్టాండులు, రైల్వే స్టేషన్లు, మార్కెట్లు, మున్సిపల్ ఆఫీసుల వద్ద ఈ క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి.
ఆహా క్యాంటీన్ ఏర్పాటు చేసే స్వయం సహాయక బృందాలకు ప్రభుత్వం రూ.13వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తోంది. క్యాంటీన్ నిర్వహించే గ్రూపులు నెలకు రూ.500 చొప్పున మహిళా సమాఖ్య సొసైటీలో జమ చేయాల్సి ఉంటుంది.

ఆహా క్యాంటీన్లలో వటంకాలను ఇంటివద్దే సిద్ధం చేస్తారు. వాటిని ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కియోస్క్ ల వద్ద విక్రయిస్తారు. క్యాంటీన్ ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో డిమాండ్ ను బట్టి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలను అందిస్తారు. ఈ క్యాంటీన్లలో ప్లేటు భోజనం గరిష్టంగా రూ.40కి విక్రయిస్తారు.

ప్రభుత్వాస్పత్రి వద్ద ఏర్పాటు చేసిన ఆహా క్యాంటీన్లో తొలిరోజు సేల్స్ బాగున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. పూటకు రూ.3వేల వరకు కౌంటర్ నడిచినట్లు వెల్లడించారు.

Related posts

సినీ ఫక్కీలో లంచావతారం పట్టివేత.. నడిరోడ్డుపై ట్రాప్.. ట్రెండ్‌ మార్చిన ఏసీబీ!

HJNEWS

జర్నలిస్టు ల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడుదాం. 

HJNEWS

వంగవీటి రాధాకృష్ణ పెళ్లి ఫిక్స్..అమ్మాయి ఎవరంటే..

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్