వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి తాను కచ్చితంగా పోటీ చేస్తానని వైఎస్సార్‌సీపీ నేత కేడీసీసీ బ్యాంకు మాజీ ఛైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు. గన్నవరంలో రెండేళ్లుగా రాజకీయ ఇబ్బందులతో తాను అజ్ఞాతవాసంలో ఉన్నట్లు చెప్పారు.. దానివల్లే తన కార్యకర్తలకు ఏం చేయలేకపోయానన్నారు. నూజివీడు కోర్టుకు వెళ్లేందుకు బయలుదేరిన వెంకట్రావు.. జడ్జి సెలవులో ఉన్నారన్న సమాచారంతో సోమవారం మధ్యాహ్నం హనుమాన్‌జంక్షన్‌లో దుట్టా రామచంద్రరావు నివాసానికి వచ్చి ఆయనతో సమావేశమయ్యారు. దాదాపు గంటన్నరకు పైగా ఆయన దుట్టా నివాసంలో ఉన్నారు.తాను గన్నవరం రాజకీయాల్లోనే ఉంటానని స్పష్టం చేశారు వెంకట్రావు. ఇక్కడి నుంచే పోటీ చేస్తానని.. ఏదైనా సరే కాలమే నిర్ణయిస్తుంది అని వ్యాఖ్యానించారు. గత రెండేళ్లుగా రాజకీయంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని.. అందుకే కాస్త దూరంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. కార్యకర్తలకు ఏమీ చేయలేకపోయానని.. కానీ వారికి అందుబాటులోనే ఉన్నానన్నారు. తాను అమెరికాను వదిలేసి గన్నవరం రాజకీయాల్లోకి వచ్చానని.. గత ఎన్నికల్లో గన్నవరం నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.చాలా రోజుల తర్వాత గన్నవరం వచ్చిన కేడీసీసీ బ్యాంకు మాజీ ఛైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు. గన్నవరం సీనియర్ నేత దుట్టా రామచంద్రరావుతో సమావేశం అయ్యారు.. తాజా పరిణామాలపై చర్చించారు. అయితే వచ్చే ఎన్నికల్లో గన్నవరం బరిలో ఉంటానని తేల్చి చెప్పారు. వైఎస్సార్‌సీపీ నుంచి అవకాశం ఇస్తే పోటీ చేస్తానంటున్నారు.. టీడీపీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారంపై స్పందించారు. తాను ఊహాజనిత ప్రశ్నలకు సమాధానం చెప్పను అన్నారు.తాను ఓడిపోతే అమెరికా వెళ్లిపోతానని ప్రచారం చేశారని.. అయినా తాను అమెరికా వెళ్లలేదన్నారు. అమెరికాలో వ్యాపారాలు ఉన్నా ఈ ఐదేళ్లలో కేవలం మూడుసార్లే వెళ్లానని.. అక్కడ ఏ వ్యాపారాలు లేని ఎమ్మెల్యేలు కూడా తనకంటే ఎక్కువ సార్లే అమెరికా వెళ్లారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేస్తారన్న ప్రచారంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. అది కాలమే నిర్ణయిస్తుందన్నారు. ఆగస్టు మొదటి వారం నుంచి కార్యకర్తలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటానన్నారు వెంకట్రావు. టీడీపీలో చేరనున్నారనే ప్రచారం జరుగుతోంది అని ప్రశ్నించగా.. ఊహాజనిత ప్రశ్నలకు తాను సమాధానం చెప్పనన్నారు. తనకు పార్టీ మారే ఆలోచన లేదని యార్లగడ్డ వెంకట్రావు వ్యాఖ్యానించినట్లు సమాచారం. అవకాశం ఇస్తే వైఎస్సార్‌సీపీ నుంచి పోటీ చేస్తానని.. లేకపోతే పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారనే చర్చ జరుగుతోంది.గత ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన వల్లభనేని వంశీ యార్లగడ్డ వెంకట్రావుపై గెలిచారు. ఆ తర్వాత వంశీ వైఎస్సార్‌సీపీ కి దగ్గరయ్యారు. వచ్చే ఎన్నికల్లో తాను వైఎస్సార్‌సీపీ నుంచి కచ్చితంగా పోటీ చేస్తానని వంశీ ఎన్నో సందర్భాల్లో చెప్పారు. అలాగే వెంకట్రావు చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. చాలా రోజుల తర్వాత మళ్లీ మీడియా ముందుకు వచ్చారు.. వచ్చే ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి కచ్చితంగా పోటీ చేస్తాను అంటున్నారు.
122 Views