Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
ఆంధ్రప్రదేశ్

విశాఖలో తల్లి ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య.. ఊరు వదిలేసొచ్చినా వదల్లేదు!

112 Views

విశాఖలో తల్లి ఇద్దరు పిల్లలతో కలిసి నీటి సంపులో దిగి ప్రాణాలు తీసుకుంది. ఆమె దెబ్బకు భయపడి ఊరే వదిలేసి వచ్చిన దంపతులు.. అయినా వేధించడంతోనే ఈ నిర్ణయం.

విశాఖపట్నంలో విషాదం చోటుచేసుకుంది. మర్రిపాలెం ప్రకాశ్‌ నగర్‌లో మంగళవారం అర్థరాత్రి దాటాక ఇద్దరు పిల్లలతో అపార్టుమెంట్‌ నీటిసంపులో దూకి తల్లి ఆత్మహత్య చేసుకుంది. మృతులు విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన వాచ్‌మెన్‌ లక్ష్మణ్ కుటుంబానికి చెందిన తల్లి సంధ్య.. ఆమె ఇద్దరు పిల్లలు గౌతమ్‌, అలేఖ్యగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనపై ఎయిర్‌పోర్టు జోన్‌ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలు కేజీహెచ్‌కు తరలించారు.

రాత్రి 10 గంటలకు అపార్ట్‌మెంట్ గేట్లు మూసివేశారు.. రాత్రి ఒంటిగంట ప్రాంతంలో చూస్తే భార్య పిల్లలు కనిపించట్లేదని లక్ష్మణ్ అంటున్నాడు. సెల్లార్ మంచినీటి సంపు మూత తీసి ఉండటంతో అనుమానం వచ్చింది.. వెంనటే వెళ్లి నీటిలో కర్ర పెట్టి పరిశీలిస్తే లోపల డెడ్ బాడీ ఉన్నట్లు గమనించినట్లు చెప్పాడు. వెంటనే పోలీసులకు అతడు సమాచారం ఇచ్చాడు.

ఈ కేసులో మరో ట్విస్ట్ బయటపడింది. పెద్దమ్మ వేధింపులు తాళలేక సంధ్య ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. దంపతులు విజయనగరం జిల్లా బొబ్బిలి నుంచి విశాఖకు వచ్చారు.. విశాఖ వచ్చినా సరే పెద్దమ్మ పార్వతి వేధింపులు ఆగలేదు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

వివేకా హత్య కేసు: నేను చెప్పినదానిని సీబీఐ మార్చింది.. హైకోర్టును ఆశ్రయించిన అజయ్ కల్లాం..

HJNEWS

స్టీరింగ్ విరిగి ఆర్టీసీ బస్సు బోల్తా.. 19 మందికి గాయాలు

HJNEWS

సినీ ఫక్కీలో లంచావతారం పట్టివేత.. నడిరోడ్డుపై ట్రాప్.. ట్రెండ్‌ మార్చిన ఏసీబీ!

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్