Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
ఆంధ్రప్రదేశ్

ఏపీ: ప్రయాణికులకు అలర్ట్.. విజయవాడ, విశాఖ మీదుగా వెళ్లే ఈ రైళ్లు వారం రద్దు

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య గమనిక.. పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లించినట్లు తెలిపారు. విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలోని సెక్షన్‌లో ఈ నెల 24 నుంచి 30 వరకూ రైల్వే కారిడార్‌ ట్రాక్‌ సిగ్నలింగ్‌ పనులు నిర్వహిస్తున్నారు. ఈ కారణంగా సామర్లకోట మీదుగా విజయవాడకు రాకపోకలు సాగించే పలు రైళ్లను రద్దు చేశామని.. మరికొన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను దారిమళ్లించామని రైల్వేశాఖ తెలిపింది. దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది.. విజయవాడ డివిజన్ పరిధిలో పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్నింటిని దారి మళ్లించారు. రైల్వే కారిడార్ ట్రాక్ సిగ్నలింగ్ పనులు నిర్వహిస్తున్నారు. ఈ కారణంగానే నేటి నుంచి ఈ నెల 30 వరకు ఈ మార్పులు ఉంటాయని తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి అందుకు తగినట్లుగా జర్నీ ప్లాన్ చేసుకోవాలని అందరికి సూచించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.రాజమహేంద్రవరం-విశాఖల (07466) మధ్య నడిచే రైలు సోమవారం నుంచి 30వ వరకు రద్దు చేశారు. విశాఖ-రాజమహేంద్రవరం (07467)ల మధ్య నడిచే రైలు నేటి నుంచి 30 వరకూ రద్దు చేశారు. కాకినాడ పోర్టు-విశాఖ (17267)ల మధ్య నడిచే రైలు 30 వరకూ రద్దు చేసినట్లు తెలిపారు. విజయవాడ- విశాఖ (22702)ల మధ్య నడిచే రైలు 30 వరకూ రద్దు చేశారు. విశాఖ-విజయవాడ (22701)ల మధ్య నడిచే రైలు నేటి నుంచి 30 వరకూ రద్దు చేశారు. విశాఖ- కాకినాడ (17268)ల మధ్య నడిచే రైలు నేటి నుంచి 30 వరకూ రద్దు చేశారు.ధన్‌బాద్‌-అలెప్పీల మధ్య నడిచే బొకారో ఎక్స్‌ప్రెస్‌ (13351) రైలు ఈనెల 25, 28, 29న నిడదవోలు, భీమవరం, గుడివాడ మీదుగా విజయవాడకు వస్తాయని తెలిపారు. హటియా-బెంగుళూరు (12835)ల మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈనెల 25న నిడదవోలు, భీమవరం, గుడివాడల మీదుగా విజయవాడ వెళుతుంది. టాటా- బెంగుళూరుల మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్‌ (12889) రైలు ఈనెల 28న నిడదవోలు, భీమవరం, గుడివాడల మీదుగా విజయవాడకు చేరుకుంటుంది.హటియా-బెంగుళూరు (18637)ల మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈనెల 29న నిడ దవోలు, భీమవరం, గుడివాడల మీదుగా విజయవాడకు వెళుతుంది. విశాఖ-గుంటూరుల మధ్య నడిచే సింహాద్రి ఎక్స్‌ ప్రెస్‌ (17240) రైలు ఈనెల 26, 29, 30లలో నిడదవోలు, భీమవరం, గుడివాడల మీదుగా విజయవాడకు వెళుతుంది. నర్సాపురం-గుంటూరు (17282)ల మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్‌ రైలు నేటి నుంచి 30 వరకూ విజయవాడ-గుంటూరుల మధ్య రద్దు చేస్తున్నట్లు తెలిపారు. గుంటూరు-నర్సాపురం (17281)ల మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్‌ రైలు నేటి నుంచి 30 వరకూ గుంటూరు-విజయవాడల మధ్య రద్దు చేశారు. ప్రయాణికులు ఈ రైళ్ల రద్దు, మళ్లింపుల విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేసుకోవాలంటున్నారు. ప్రయాణికులు ఆయా రైళ్లు నిలుపుదలయ్యే స్టేషన్లలో బుకింగ్‌ అధికారి కార్యాలయాలలో సంప్రదించాలని సూచిస్తున్నారు.

Related posts

నేడు నీలిరంగు చందమామ ఆవిష్కృతం…!

HJNEWS

టీడీపీ కడప ఎంపీ అభ్యర్దిగా వివేకా సతీమణి సౌభాగ్యమ్మ..!!

HJNEWS

భూమా ఫ్యామిలీలో సీటు పంచాయితీ.. అన్నదమ్ముల మధ్య వార్ తప్పదా, రేసులో మాజీ ఎమ్మెల్సీ కూడా!

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్