Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
ఆంధ్రప్రదేశ్రాజకీయం

ఈ నెల 16 నుంచి భట్టి పాదయాత్ర

103 Views

ఈ నెల 16 నుంచి భట్టి పాదయాత్ర
ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అతలాకుతలం చేస్తున్నది

గాంధీ వారసులుగా టోపీలు పెట్టుకొని అవినీతిని ఊడ్చివేస్తామని అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ సర్కార్ ఇప్పుడు లిక్కర్ స్కాముకు పాల్పడి దేశానికి మాయని మచ్చ తెచ్చారు

అన్నాహజారే పక్కన కూర్చొని అపరగాంధేయ వాదిగా ప్రచారం చేసుకుని అవినీతిపై ఉద్యమం చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రభుత్వం లిక్కర్ స్కాంకు పాల్పడినారని దర్యాప్తు సంస్థలు చెబుతుంటే ఇప్పుడు వారిని ఏమి అనాలో అర్థం కావడం లేదు.

దేశంలో ఇంత పెద్ద కుంభకోణం జరిగితే అవినీతికి వ్యతిరేకంగా సత్యాగ్రహం చేసిన అన్నా హజారే గారు ఎక్కడ వున్నారు?

మద్యానికి వ్యతిరేకంగా పోరాడిన అన్నా హజారే తన ఆలోచనలు, సేవను కేజ్రీవాల్ కు దార పోశారు. ఢిల్లీలో జరిగిన లిక్కర్ కుంభకోణంపై అన్న హజారే గారు బయటకు వచ్చి మాట్లాడాల్సిందే లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కున్న ఢిల్లీ మంత్రి సిసోడియా పదవికీ రాజీనామా చేయడం ఆమోదించడం బాగానే ఉంది. కానీ లిక్కర్ పాలసీ నిర్ణయం రాష్ట్ర క్యాబినెట్ లో ఉన్న ముఖ్యమంత్రి తో పాటు మంత్రులందరి బాధ్యత లిక్కర్ కుంభకోణంపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి లిక్కర్ స్కాం అభియోగాలపై తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు ఈడీ నోటీసులు ఇస్తే.. సమగ్ర విచారణకు సిద్ధమని వెళ్లాలి కానీ.. తెలంగాణ ప్రజలకు అవమానమని వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు.
లిక్కర్ స్కామ్ కు తెలంగాణ సమాజానికి సంబంధం ఏంటీ?

ఈనెల 16 నుండి యాత్ర చేస్తాను. రూట్ మ్యాప్ ఇవ్వాళ రేపట్లో ఫైనల్ అవుతుంది.

తెలంగాణ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధిపొందాలని చూస్తుండ్రు

తెలంగాణ సమాజం ఈ విషయాన్ని గమనించాలి

లిక్కర్ స్కాములో ఉన్న ఎంత పెద్దవారినైనా వదలొద్దు.

ఎమ్మెల్సీ కవితకు ఇచ్చిన ఈడి నోటీసులు తెలంగాణ ప్రజలకు అవమానమని ఎవరైనా మాట్లాడితే తెలంగాణ సమాజం వారిని ప్రశ్నించాలి

ప్రతిపక్షాలను వేధించడానికి కేంద్ర ప్రభుత్వం ఐటీ సిబిఐ, ఈడీ లను వాడుతోందనడంతో సందేహం లేదు

కానీ లిక్కర్ స్కామ్ వేరు.., వేధింపులు వేరు. ఈ.డి వేధింపులకు ఈ స్కాంకు సంబంధం లేదు.

ఢిల్లీలో లిక్కర్ పాలసీ మార్చారా? లేదా? అందులో భాగస్వాములుగా ఉన్నారా? లేదా? అన్నది దర్యాప్తు సంస్థలు చేసిన విచారణలో స్పష్టంగా కనిపిస్తున్నది కదా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు పై విధంగా సమాధానం ఇచ్చారు.

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలకు ఈ.డి నోటీసులు ఇచ్చారు

దేశ స్వాతంత్రం కోసం ఏర్పాటు చేసిన పేపెర్ ను కాపాడుకోడానికి కాంగ్రెస్ పార్టీ నుంచి రుణం ఇచ్చి ఆదుకుంటే నోటీసులు ఇచ్చి వేధించారు.

కరీంనగర్ లో ఈరోజు జరిగే హాత్ సే హాత్ జోడో బహిరంగ సభకు హాజరవుతాను

పాదయాత్ర ఆదిలాబాద్ నుండి ఖమ్మం వరకు ఉంటది

ఈనెల 16 నుండి యాత్ర చేస్తాను. రూట్ మ్యాప్ ఇవ్వాళ రేపట్లో ఫైనల్ అవుతుంది.

Related posts

ఏమాత్రం వన్నె తగ్గని త్రిష.. రోడ్డుపై శ్రీలీల డ్యాన్స్.. బ్రో బ్యూటీ ట్రీట్

HJNEWS

తెలంగాణ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల జాబితా: సోనియాతో రేవంత్

HJNEWS

జనసేన కార్యాలయంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. జెండా ఎగురవేసిన పవన్

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్