Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
ఆంధ్రప్రదేశ్

వైయస్ షర్మిల గారి అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు

105 Views

వైయస్ షర్మిల గారి అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు
వైయస్ షర్మిల గారి అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మహిళలపై జరుగుతున్న వేదింపులు, అత్యాచారాలపై శాంతియుతంగా ట్యాంక్ బండ్ రాణీ రుద్రమాదేవి విగ్రహం ఎదుట YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల గారు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. వైయస్ షర్మిల గారి అక్రమ అరెస్టుకు నిరసనగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో YSR తెలంగాణ పార్టీ నాయకులు ధర్నాకు దిగారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా భువనగిరి పట్టణంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర పౌర సంబంధాల అధికారిని ఇశ్రత్ జహాన్ ను YSR తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎండీ అతహర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. అనంతరం వైయస్ షర్మిల గారి అక్రమ అరెస్టును ఖండిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో YSR తెలంగాణ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించడం జరిగింది. సూర్యాపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ పిట్ట రాంరెడ్డి గారి ఆదేశాల మేరకు, సూర్యాపేట పట్టణ అధ్యక్షుడు డేగల రమేష్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌక్ దగ్గర మహిళ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైయస్ షర్మిల గారి అక్రమ అరెస్టుకు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డేగల రమేష్ గారు మాట్లాడుతూ…ఇప్పటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు మహిళలను చిన్న చూపు చూస్తున్నాయి అన్నారు. రాజకీయాల్లో అయినా, మహిళలు చేసే ఉద్యోగ విషయంలో అయిన మహిళలు అంటే కొన్ని ప్రాంతాల్లో బానిసల చూస్తున్నారని తెలిపారు. మహిళకు సరైన రక్షణ లేక రోజు ఎదో ఒక చోట మహిళలపై దాడులు హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మహిళల రక్షణ కోసం కఠినమైన చర్యలు తీసుకొని మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతి శాఖలో మగవారితో సమానంగా ఆడవారికి ఉద్యోగాల, హక్కులు కల్పించాలని తెలిపారు. రాజకీయాల్లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలని పేర్కొన్నారు. ఒంటరిగా జీవనం సాగిస్తున్న మహిళలను అన్ని విధాలుగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు డేగల రమేష్ నాయుడు, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు గోరెంట్ల సంజీవ, మండల మహిళా అధ్యక్షురాలు చారల సరిత, మహమ్మద్ రఫీ, టౌన్ యూత్ పిప్పల సతీష్, వీరబోయిన వేణు, ఎస్కే బాబా తదితరులు పాల్గొన్నారు.

సత్తుపల్లి నియోజకవర్గంలో వైయస్ షర్మిల గారి అరెస్టుకు నిరసనగా పలువురు YSR తెలంగాణ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. చాకలి ఐలమ్మ ఆశయాలు నెరవేరాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జన్నారెడ్డి నరసింహారెడ్డి, మంచాల నాగేష్, నూనె స్వామి, పి.సాయి, జెన్నరెడ్డి విజయ తదితరులు పాల్గొన్నారు. YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల గారి అరెస్టును నిరసిస్తూ ఖమ్మం అసెంబ్లీ ఇంఛార్జి తుంపాల కృష్ణమోహన్ ధర్నా చౌక్ వద్ద నిరసన తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం మహిళల పట్ల చూపుతున్న వివక్షకు ప్లే కార్డు ద్వారా పెద్దఎత్తున మహిళలు నిరసన కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా తుంపాల కృష్ణ మోహన్ గారు మాట్లాడుతూ…కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణాలో మహిళలు బయట తిరిగే పరిస్తితి లేదని, ప్రతి రోజూ ఎన్నో హత్యాయత్నాలు, ఆత్మహత్యలు, మానభంగాలు చిన్న పిల్లలు నుంచి వృద్దుల వరకు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకి చట్టసభలలో కూర్చునే హక్కును కాలరాసాడు ఈ కేసీఆర్ అని, తన బిడ్డ కల్వకుంట్ల కవితకు తప్ప ఏ మహిళకు న్యాయం జరగలేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర అధ్యక్షులు తుమ్మా అప్పిరెడ్డి, సీనియర్ నాయకులు ఆలస్యం సుధాకర్, మహిళా నాయకురాలు అరుణ, నీలమ్మ, శేషమ్మ, మౌనిక కంచుమర్తి, ప్రధాన కార్యదర్శి రావుల గంగరాజు, యూత్ నాయకులు ఫాయస్ పాషా, గాజుల వరుణ్, ఎస్.వీ సత్యనారాయణ, అక్బర్ పాషా, గడ్డం కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో వైయస్ షర్మిల గారి అక్రమ అరెస్టుకు నిరసన తెలిపిన YSR తెలంగాణ పార్టీ నాయకులు. నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ బుస్సాపూర్ శంకర్ గారి ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ గారి విగ్రహానికి పులా మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బుస్సాపూర్ శంకర్ గారు మాట్లాడుతూ…ఇప్పటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలను చిన్న చూపు చూస్తున్నాయని అన్నారు. మహిళలకు తెలంగాణలో రక్షణ లేదని తెలిపారు. మహిళలపై దాడులు పెరుగుతున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మహిళల రక్షణ కోసం కఠినమైన చర్యలు తీసుకొని మహిళలకు రక్షణ కల్పించాలని అన్నారు. ప్రతి శాఖలో మగవారితో సమానంగా ఉద్యోగాలు ఇవ్వాలని, అన్ని హక్కులు కల్పించాలని, రాజకీయాల్లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్ టీ విభాగం అధ్యక్షులు మోహన్ నాయక్, నగర అధ్యక్షులు కస్తూరి ప్రవీణ్, నగర ప్రధాన కార్యదర్శి ఆనంద్, సాయిలు, మహిళ విభాగం నగర అధ్యక్షురాలు బుడిగే హరిని, నగర యువజన విభాగం అధ్యక్షులు సంతోష్, మహిళ నేతలు శశిరేఖ, సీనియర్ నాయకులు సలీమ్, పాండు తదితరులు పాల్గొన్నారు. వైయస్ షర్మిల గారి అక్రమ అరెస్టుకు నిరసనగా YSR తెలంగాణ పార్టీ ధర్మపురి నియోజకవర్గం ఇంఛార్జ్ మొకెనపెల్లి రాజమ్మ రాస్తారోకో చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాజమ్మ మాట్లాడుతూ…మహిళలపై దాడులు పెరుగుతున్నా కేసీఆర్ సర్కార్ పట్టించుకోవడం లేదని తెలిపారు.

Related posts

గుడివాడలో టీడీపీ ఖాళీ అవుతోంది: వైసీపీలో భారీగా చేరికలు

HJNEWS

హైదరాబాద్ – విజయవాడ హైవేపై మున్నేరు వరద.. క్రేన్‌తో విద్యార్థుల తరలింపు

HJNEWS

వైసీపీకి యార్లగడ్డ వెంకట్రావు గుడ్‌బై.. టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటన

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్