Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
YSRCPఆంధ్రప్రదేశ్

వ్యాఖ్యల వెనుక అసలు కారణం అదే..పీకే తీసేసిన తహసీల్దారన్న కొడాలి నాని

ఏపీలో వచ్చే ఎన్నికల్లో జగన్ భారీగా నష్టపోవడం ఖాయమంటూ ఒకప్పటి వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటిపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఇదే క్రమంలో వైసీపీ మాజీ మంత్రి కొడాలీ నాని కూడా వీటిపై తీవ్రంగా స్పందించారు. పీకే ఓ తీసేసిన తహసీల్దార్ అని, అతను ఇప్పుడు ఏ పార్టీకి పనిచేయడం లేదని, కేవలం జాతకాలు చెప్పుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రశాంత్ కిషోర్ కి ప్రస్తుతం ఏ రాష్ట్రంలో, ఏ రాజకీయ పార్టీ వ్యూహకర్తగా పెట్టుకోలేదని మాజీ మంత్రి కొడాలి నాని తెలిపారు. ఐప్యాక్ నుంచి పీకేను తన్ని తరిమేశారన్నారు. ఐప్యాక్ వైసీపీకి రిషి ఆధ్వర్యంలో ఇప్పటికీ పనిచేస్తోందన్నారు. లగడపాటి రాజగోపాల్ లా పీకే జోతిష్యం చెప్పడం మొదలుపెట్టాడని, పీకే వృత్తి రాజకీయ పార్టీల్ని డబ్బు తీసుకుని గెలిపించడమే అన్నారు. కానీ జాతకాలు చెప్పడం కాదన్నారు.

ఇతను తీసేసిన తహసీల్దార్ అంటూ పీకేపై కొడాలి ఫైర్ అయ్యారు. ఐప్యాక్ నుంచి తరిమేస్తే బీహార్ లో రాజకీయ పార్టీ పెట్టి దివాళా తీశాడన్నారు. చంద్రబాబు వంటి పనికిమాలిన వ్యక్తుల దగ్గర ప్యాకేజీ తీసుకుని జోతిష్యాలు చెబుతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీకే చెప్తే రెండు, మూడు శాతం ఓట్లు మారతాయని చంద్రబాబు ఆశ అన్నారు. కేసీఆర్ గెలుస్తాడని గతంలో పీకే చెప్పాడు, రాజస్తాన్ లో కాంగ్రెస్ పార్టీ థంపింగ్ మెజార్టీతో వస్తుందనీ చెప్పాడన్నారు. చత్తీస్ ఘడ్ లోనూ కాంగ్రెస్ మళ్లీ గెలుస్తుందని చెప్పాడని గుర్తుచేశారు. ఈ మూడు నాలుగు నెలల్లోనే ఈ జాతకాలు చెప్పి విఫలమయ్యాడన్నారు

ఇప్పుడు ఏపీలో జగన్ గెలిచే అవకాశం లేదని, టీడీపీ గెలుస్తుందని జోతిష్యం చెప్పాడని పీకేపై ఫైర్ అయ్యారు. ఇలాంటి వారిని తప్పించినందుకు జగన్ కు ముందుగా కంగ్రాట్స్ అన్నారు. పీకే వంటి వారిని డబ్బులు తీసుకుని సర్వేలు చేయకుండా పిచ్చివాగుడు వాగుతున్నాడన్నారు. ఇతని పనికిరాని వ్యక్తుల మాటలు జనం పట్టించుకోరని కొడాలి తెలిపారు.జగన్ గతంలో వచ్చిన 151 కంటే ఎక్కువ సీట్లతో అధికారంలోకి వస్తారన్నారు. జగన్ మీద డబ్బులు తీసుకుని చిల్లర వాగుడు వాగే వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

Related posts

‘బ్రో’ మూవీలో ఏపీ మంత్రి డాన్స్‌తో పాటు సీఎం పై పవన్ కళ్యాణ్ సెటైర్స్.. వైరల్ అవుతున్న వీడియో..

HJNEWS

టీడీపీ కడప ఎంపీ అభ్యర్దిగా వివేకా సతీమణి సౌభాగ్యమ్మ..!!

HJNEWS

వైసీపీకి యార్లగడ్డ వెంకట్రావు గుడ్‌బై.. టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటన

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్