Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
ఆంధ్రప్రదేశ్

‘బ్రో’ మూవీలో ఏపీ మంత్రి డాన్స్‌తో పాటు సీఎం పై పవన్ కళ్యాణ్ సెటైర్స్.. వైరల్ అవుతున్న వీడియో..

104 Views

‘బ్రో’ మూవీలో ఏపీ మంత్రి డాన్స్‌తో పాటు సీఎం పై పవన్ కళ్యాణ్ సెటైర్స్.. వైరల్ అవుతున్న వీడియో..
పవన్ కళ్యాణ్ ఓ సినిమాలు .. మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. తాజాగా ఈయన హీరోగా నటించిన ‘బ్రో’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాలో ఏపీ మంత్రిపై వేసిన సెటెర్స్ గురించి అభిమానులు చర్చించుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్ ఓ సినిమాలు .. మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ కోవలో ఈయన లీడ్ రోల్లో నటించిన ‘బ్రో’ మూవీ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో తొలిసారి తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో కలిసి నటిండంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ‘బ్రో’ సినిమా తమిళంలో హిట్టైన ‘వినోదయ సీతం’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. ఈ సినిమాను తెలుగు నేటివిటికి తగ్గట్టు పలు మార్పులు చేర్పులతో తెరకెక్కించారు. అంతేకాదు ఈ సినిమాలో త్రివిక్రమ్ రాసిన డైలాగులు పవన్ కళ్యాణ్ పొలిటికల్ లైఫ్‌కు ఊత మిచ్చేలా ఉన్నాయి. ఓ సన్నివేశంలో పవన్ కళ్యాణ్.. ఈ లోకంలో మనం ఒంటిరిగా వస్తాము. ఒంటరిగానే పోతాము.

అంతా నాదుకున్న వాళ్లు చివరకు మిగిలేది ఏమి ఉండదంటూ ఏపీ సీఎంపై జగన్ పై తనదైన శైలిలో పంచ్‌లో వేసారు. ఈ డైలాగులు పవన్ కళ్యాణ్ అభిమానులకు ఊపు తెప్పిస్తే.. వైయస్ఆర్సీపీ అభిమానులకు మాత్రం కావాలనే మా నాయకుడికి కించ పరిచేలా ఈ సీన్స్ కావాలనే పెట్టినట్టు చెబుతున్నారు. ఇంటర్వెల్ తర్వాత ఏపీ మంత్రి అంబటి రాంబాబు అప్పట్లో చేసిన డాన్స్ మూమెంట్స్‌ను 30 ఇయర్స్ పృథ్వీ రాజ్ ఇమిటేట్ చేయించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్.. ఏపీ మంత్రిపై చేసిన రాగింగ్ మాములుగా లేదంటున్నారు. మరోవైపు వైసీపీ ఫ్యాన్స్ మాత్రం పవన్ కళ్యాణ్ చేసేది లేక ఇలా సినిమాలో తన అక్కసు వెళ్లగొక్కారు.

‘బ్రో’ సినిమా విషయానికొస్తే.. తెలుగులో రూ. 97.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 98.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1500 నుంచి 1650 స్క్రీన్స్‌లో విడుదలైంది. ఇక ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించారు. థమన్ సంగీతం అందించారు. తమిళ్‌లో సముద్రఖని చేసిన పాత్రలో పవన్ చేసారు. తంబి రామయ్య అనే మరో కీలక పాత్రలో సాయి ధరమ్ తేజ్ నటించాడు. ఇక ఈ సినిమాకు తెలంగాణలో టికెట్ రేట్ హైక్స్ కలిసొచ్చే అంశమనే చెప్పాలి. ఏపీలో మాత్రం నార్మల్ టికెట్ రేట్స్‌తో విడుదలైంది.

ఓ వైపు తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు.. మరోవైపు ఆంధ్ర ప్రదేశ్‌లో టికెట్ ఇష్యూ నడుస్తోన్న ఈ సినిమాను చూడటానికి అభిమానులు పోటెత్తారు. అభిమానులు వర్షాన్ని లెక్క చేయకుండా ఎలాగైనే పవన్ కళ్యాణ్ చూసారు. ఇప్పటికే పాజిటిట్ టాక్ రావడంతో రేపు, ఎల్లుండి ఈ సినిమాకు ప్రజలు జాతరలా పోటెత్తే అవకాశాలు లేకపోలేదు.

Related posts

సజ్జల రామకృష్ణ రెడ్డి కార్యాలయాన్ని ముట్టడించిన గెస్ట్‌ లెక్చరర్స్‌

HJNEWS

ఆ బాధ్యత నేను తీసుకుంటా.. కడప జిల్లాలో చంద్రబాబు వ్యాఖ్యలు

HJNEWS

విద్యార్థుల జీవితాలతో బీజేపీ చెలగాటం.

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్