Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
సినిమా వార్తలు

విశ్వంభరలో ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్.. ఆ సెంటిమెంట్ ప్రకారం ఇది కూడా హిట్టే!

48 Views

ఈ మధ్య కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో యంగ్ హీరోల కంటే సీనియర్ స్టార్లే వేగంగా సినిమాలు చేస్తున్నారు. ముఖ్యంగా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తూ.. వరుస సినిమాలు చేస్తున్నారు. ఇలా ఇప్పటికే పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఈ క్రమంలోనే మరిన్ని ప్రాజెక్టులు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘బింబిసార’ ఫేం మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ అనే సినిమాను చేస్తున్నారు. సోషియో ఫాంటసీ జోనర్‌లో రూపొందుతోన్న ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని రూపొందిస్తున్నారు. ఇందుకోసం చిత్ర యూనిట్ భారీ బడ్జెట్‌ను కూడా కేటాయించిన విషయం తెలిసిందే.

మెగాస్టార్ చిరంజీవి – మల్లిడి వశిష్ట కలిసి చేస్తున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ కొద్ది రోజుల క్రితమే మొదలైంది. ఇందులో భాగంగానే పలు షెడ్యూళ్లను ప్లాన్ చేసి క్రేజీ సీన్స్‌ను తెరకెక్కించారు. అలాగే, మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ త్రిషపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను షూట్ చేశారు. ఇలా మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేయబోతున్నారు.

సోషియో ఫాంటసీ జోనర్‌లో రాబోతున్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో పలు భాషల్లో తెరకెక్కించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం కోసం పలు ఇండస్ట్రీలకు చెందిన నటీనటులను తీసుకుంటున్నారు. అంతేకాదు, కొందరు యాక్టర్లను కూడా ఖరారు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌటేలాను ఈ చిత్రం కోసం ఫైనల్ చేసినట్లు తెలిసింది.

విజువల్ వండర్‌గా రాబోతున్న ‘విశ్వంభర’ మూవీలో ఓ స్పెషల్ సాంగ్‌ను పెడుతున్నట్లు తాజాగా న్యూస్ బయటకు వచ్చింది. అంతేకాదు, ఇందులో ఊర్వశీ రౌటేలా కనిపించబోతున్నట్లు తెలిసింది. గతంలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’లో సైతం ఆమె స్పెషల్ సాంగ్ చేసింది. ఆ సినిమా హిట్ కావడంతో ఇప్పుడు అదే సెంటిమెంట్‌ వర్కౌట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. మెగాస్టార్ చిరంజీవి – వశిష్ట కాంబినేషన్‌లో రూపొందుతోన్న ‘విశ్వంభర’ మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రను చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 10 తేదీన విడుదల చేయబోతున్నారు.

Related posts

ది మోస్ట్ స్టైలిష్‌గా విజయ్.. ఖుషి టైటిల్ సాంగ్ వైరల్

HJNEWS

అటు చీర్స్ కొడుతున్న ఛార్మీ..ఇటు కాళ్లు నాకుతున్న ఆర్జీవీ.. పిక్స్ వైరల్

HJNEWS

సింగపూర్ వీధుల్లో బిగ్ బాస్ బ్యూటీ అందాల మోత.. బాబోయ్ ఏంటీ డ్రెస్సు!!

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్