Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
సినిమా వార్తలు

NBK 109​ ఆ హీరోయిన్​కు బాలయ్య సర్​ప్రైజ్… సెట్స్​లో సెలబ్రేషన్స్​తో రచ్చ రచ్చ

నందమూరి నటసింహం ప్రస్తుతం ఫుల్ జోష్​లో ఉన్న సంగతి తెలిసిందే. ఓవైపు రాజకీయాల్లో మరోవైపు సినిమాల్లో జోరు చూపిస్తున్నారు. సినిమాల విషయానికొస్తే హ్యాట్రిక్​హిట్స్​తో దూకుడు మీదున్న ఆయన ప్రస్తుతం NBK 109 వర్కింగ్ టైటిల్​తో తెరకెక్కుతున్న సినిమా షూటంగ్​తో బిజీగా ఉంటున్నారు. అయితే తాజాగా ఆయన మూవీటీమ్​సెట్స్​లో హీరోయిన్​కు సర్​ప్రైజ్ ఇచ్చారు! దానికి సంబంధించిన వీడియో సోషల్​మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది. ఇంతకీ బాలయ్య అండ్ టీమ్ ఇచ్చిన సర్​ప్రైజ్​ఏంటి? ఏ హీరోయిన్​కు ఇచ్చారు? వంటి వివరాలను ఈ స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం…

పవర్‌ఫుల్‌ యాక్షన్‌ కథాంశంతో ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్​ను జరుపుకుంటోంది. ఇప్పటికే బ్లడ్‌ బాత్‌కు బ్రాండ్‌ నేమ్‌.. వయలెన్స్‌కు విజిటింగ్‌ కార్డ్‌ అనే క్యాప్షన్‌తో విడుదలైన పోస్టర్​కూడా సినీ ప్రియులను బాగా ఆకట్టుకుంది. సితార ఎంటర్‌టైనర్‌మెంట్‌ బ్యానర్​పై సూర్య దేవరనాగవంశీ, సాయి సౌజన్య చిత్రాన్ని భారీ బడ్జెట్​తో నిర్మిస్తున్నారు. ఇంకా ఈ చిత్రం మలయాళ స్టార్ హీరో దుల్కర్‌ సల్మాన్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. తమన్నాతో ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉన్నట్లు ప్రచారం కూడా సాగింది. అయితే ఇప్పుడు సినిమాలో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా నటించనున్నట్లు క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే తాజాగా మూవీటీమ్ ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో ఎన్​బీకే 109 టీమ్​ఈ ముద్దుగుమ్మ బర్త్​డే వేడుకలను గ్రాండ్​గా జరిపింది.

షూటింగ్​స్పాట్​లో ఈ సెలబ్రేషన్స్​తో ఆమెకు సర్​ప్రైజ్ ఇచ్చింది. అందరూ కేక్ కట్​చేసి తినిపించుకుంటూ సరదాగా గడిపారు. తన బర్త్​డేను గ్రాండ్​గా జరిపిన మూవీటీమ్​కు ఆమె హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలిపారు. వీడియోలో దర్శకుడు బాబీ కూడా సందడి చేశారు. కేక్ తినమంటే సిగ్గుపడుతూ, కొంచెం కొంచెంగా కొరుక్కుతింటూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే వేడుకల్లో బాలయ్య పాల్గొనలేదు. ఎందుకంటే ఆయన ఎన్నికల్లో బిజీగా ఉంటున్నారు. దీంతో షూటింగ్స్​కు లాంగ్ బ్రేక్ ఇచ్చినట్టున్నారు. దీంతో బాలయ్య లేని సీన్స్​ను బాబీ టీీమ్​షూట్ చేస్తోంది. బాలకృష్ణ షెడ్యూల్ మాత్రమే పెండింగ్ ఉండేలా ప్లాన్ చేస్తూ షూటింగ్​తో ముందుకెళ్తోంది. కాగా, యాక్షన్ ఎంటర్టైనర్​గా రూపొందుతున్న ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్​ను మూవీటీమ్​త్వరలోనే రిలీజ్ చేయనుంది.

Related posts

బీచ్‌లోబిగ్ బాస్ పిట్ట ఇనయ.. పిక్కలు చూపిస్తూ పిటపిట.. లేటెస్ట్ పిక్స్

HJNEWS

నడి రోడ్డుపై అరియానా అందాల ఆరబోత.. బిగ్ బాస్ బ్యూటీ మైండ్ బ్లోయింగ్ గ్లామర్ డోస్

HJNEWS

‘బేబి’ 2 వీక్స్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. మరో మైల్ స్టోన్ అందుకున్న చిన్న సినిమా..

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్