ప్రముఖ ఫోక్ సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సింగర్ మంగ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ సాంగ్స్ తో తన కెరీర్ ను మరింత పాపులారిటీగా మార్చుకున్న ఈమె మొదట యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టింది.ఇక సినిమాలలో కూడా అదరగొట్టే పాటలతో మంచి పేరు తెచ్చుకొని స్టార్ గా ఎదిగిన మంగ్లీ ఇప్పటికే తక్కువ సమయంలో దాదాపు 100 కి పైగా పాటలు పాడి మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకుంది. అంతేకాదు నటిగా పలు సినిమాలు కూడా చేసింది.
ఇక మంగ్లీ ప్రతి పండుగకు కూడా ఒక ప్రైవేట్ సాంగ్ పాడి స్పెషల్ వీడియో షూట్ చేయించి తన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంటున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం తెలంగాణలో బోనాలు జరుగుతున్న సందర్భంగా అక్కడ ఒక ప్రైవేట్ సాంగ్ షూటింగ్ జరుగుతుంది. ఆ షూటింగ్ సమయంలోనే మంగ్లీ జారి కింద పడడంతో ఆమె కాలికి గాయం అయ్యిందని తెలుస్తోంది. దీంతో వెంటనే యూనిట్ మొత్తం మంగ్లీని హాస్పిటల్ కి తరలించగా వైద్యులు చికిత్స అందించిన అనంతరం ఆమెను డిశ్చార్జ్ చేశారని తెలుస్తోంది.