Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
అంతర్జాతీయంరాజకీయం

ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీదే హవా.. అనుమానమే అవసరం లేదు: నటుడు పృథ్వీరాజ్‌

13 Views

ఏపీలో జరగబోయే 2024 ఎన్నికలపై నటుడు పృథ్వీరాజ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు కచ్చితంగా జగన్ సర్కార్‌కు బుద్ధి చెబుతారన్నారు.

వచ్చే ఎన్నికలపై జోస్యం చెప్పారు జనసేన నాయకుడు, సినీ నటుడు పృథ్వీరాజ్‌. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ పాలన అధ్వానంగా ఉందని విమర్శించారు. పృథ్వీరాజ్‌ సొంతంగా దర్శకత్వం వహిస్తూ రూపొందించిన కొత్త రంగుల ప్రపంచం సినిమా టీమ్ ఖమ్మం జిల్లా బోనకల్లు వెళ్లారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, వచ్చే ఎన్నికలపై తన అభిప్రాయాలను చెప్పుకొచ్చారు. రాబోయే ఎన్నికల్లో జగన్‌కు ప్రజలు కచ్చితంగా బుద్ది చెప్పడం ఖాయమన్నారు.

ఏపీలో 2024లో జరగబోయే సాధారణ ఎన్నికల్లో జనసేన తన ప్రభంజనం సృష్టించబోతుందన్నారు పృథ్వీ. బ్రో సినిమాలో శ్యాంబాబు పాత్రలో దర్శకుడు చెప్పినట్లు నటించాను తప్ప వేరే వాళ్ల గురించి తెలియదన్నారు. బోనకల్‌లో పృథ్వీరాజ్‌‌తో పాటుగా కొత్త రంగుల ప్రపంచం సినిమా యూనిట్ టీవీ ఆర్టిస్ట్‌ బానోత్‌ శ్రీనివాసరావు ఇంటికి అతిథులుగా వెళ్లారు. హీరోయిన్‌గా తన కుమార్తె శ్రీ, హీరోగా తన మిత్రుడి కుమారుడు క్రాంతి నటించారన్నారు. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూసి ఆనందించాలని కోరారు.

Related posts

అక్రమ ఆస్తులు, దోపిడీపై సమాచారం ఇచ్చేవారికి గిఫ్ట్.. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన

HJNEWS

భారీ వర్షాలు, వరదలపై సీఎం సమీక్ష .. వారికి రూ.10వేలు ఇవ్వండి : అధికారులకు జగన్ ఆదేశాలు

HJNEWS

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్.. దసరాకు అదిరే కానుక, వారికి 5 సీఎల్స్!

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్