శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం
కొత్తపేట : బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన వ్యక్తి సర్దార్ గౌతులచ్ఛన్న అని టిడిపి నేత, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. కొత్తపేటలో సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. సర్దార్ గౌతు లచ్ఛన్న విగ్రహానికి రెడ్డి సుబ్రహ్మణ్యం పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మండల శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో శ్రీశయన సామాజిక వర్గంలో పుట్టిన గౌతులచ్చన్న స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారన్నారు.ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ప్రకాశం పంతులతో విభేదించి అవిశ్వాస తీర్మానం పెట్టి ప్రభుత్వాన్ని పడగొట్టడంలో కీలకపాత్ర వహించారని గుర్తు చేశారు.సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ బిరుదు పొందిన వ్యక్తి గౌతు లచ్చన్న అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మండల శెట్టిబలిజ గౌరవ అధ్యక్షుడు రెడ్డి రామకృష్ణ,సంఘ అధ్యక్షుడు కముజు వెంకటేశ్వరరావు,కడలి పెరుమాళ్లు, దూనబోయిన శ్రీనివాస్, రెడ్డి శ్రీనివాస్, యెల్లమెల్లి జగన్మోహన్, మట్టపర్తి సూర్యచంద్రరావు, పితాని రాంబాబు,బొంతు గౌరి శంకర్, కముజు గంగాధరరావు,బొక్కా కుమార్, వాసంశెట్టి సత్యనారాయణ, కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు,బొక్కా సుబ్రహ్మణ్యం, యనమదల కొండ,దూనబోయిన ప్రదీప్,దొంగ రమేష్, మేడిశెట్టి నాగేశ్వరరావు, దూనబోయిన నాగేశ్వరరావు,శీలం శ్రీను,శీలం రామకృష్ణ,కముజు తాతాజీ,కొప్పిశెట్టి వాసు,కడలి భీమా,జోగి మురళి,యెల్లమెల్లి బుజ్జి,కడలి పార్థసారథి,కముజు గోపి, ముషిని వెంకటరమణ, మట్టపర్తి జానకి రామయ్య,రాయుడు బాబీ,దొంగ శివ, మట్టపర్తి ప్రసాద్,జోగి గనిరాజు, చొల్లంగి కనక లింగేశ్వరరావు వాసంశెట్టి శ్రీనివాస్,చింతపల్లి కృష్ణ,తదితరులు పాల్గొన్నారు.