బాపులపాడు గ్రామంలో హనుమాన్ నగర్ ఏరియాలో జరుగుతున్న అభివృద్ధి మరియు పారిశుధ్య పనులను సర్పంచ్ శ్రీమతి సరిపల్లి కమలా కిరణ్ వార్డు సభ్యులు శ్రీ తాడిసెట్టి శ్రీనివాస రావు , పంజుగల సీత, ఎంపీటీసీ సభ్యురాలు శ్రీమతి మత్తి లక్ష్మి మాధవి లతో కలిసి పర్యవేక్షించడం జరిగింది..హనుమాన్ నగర్ ఏరియాలో వర్షాకాలం వొస్తే కొన్ని ప్రాంతాల లోని ఇళ్ళల్లో వాళ్ళు మోకాలి లోతు నీళ్ళల్లో నడుచుకుంటూ బయటకు వొచ్చే పరిస్తితి వుండేది..అటువంటి రోడ్లను వార్డు సభ్యుల ద్వారా తెలుసుకుని గ్రావెల్ రోడ్లగా అభివృద్ధి చేయటం జరుగుతుంది..అలాగే కొన్ని రోడ్ల మీద డ్రైన్ తీసిన సిల్ట్ పేరుకుపోవడంతో రోడ్ల వెడల్పు తగ్గిపోయి వాహనదారులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఆ సిల్ట్ కూడా తొలిగించే కార్యక్రమం మొదలు పెట్టారు.కొన్ని రోజుల క్రితం నిర్మాణం చేపట్టి పూర్తి అయిన సీసీ రోడ్ మరియు డ్రైన్ లను పరిశీలించడం జరిగింది.ఈ సందర్భంగా సర్పంచ్ కమల కిరణ్ మాట్లాడుతూ గౌరవ శాసనసభ్యులు శ్రీ వల్లభనేని వంశీ మోహన్ గారి సూచనలతో గ్రామం లోని అన్ని ప్రాంతాల్లో వున్న సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో నిధుల లభ్యతను బట్టి చేసుకుంటూ వస్తున్నామని ఎక్కువగా రైల్వే స్టేషన్ ఏరియా,ఎంజీ నగర్,తారక రామ నగర్,ఐటిఐ రోడ్, వేలేరు రోడ్, ఎస్ సీ కాలనీ గట్టు, బి సి కాలనీ ఏరియాలో డ్రైన్ సమస్య వుంది అని అవి కూడా వీలైనంత త్వరలో నిధులు సమకూర్చి బోర్డు సభ్యుల సహకారంతో పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పంజుగల నాగరాజు,ఇఓ ప్రసాద్,పంచాయతీ సిబ్బంది మరియు స్థానికులు పాల్గొనటం జరిగింది..
బాపులపాడు గ్రామంలో పారిశుధ్య పనులను ప్రారంభించిన సర్పంచ్ సరిపల్లి కమలా కిరణ్
by HJNEWS
previous post