గన్నవరం నియోజకవర్గ గన్నవరం ప్రెస్ క్లబ్ నందు ఏపీయూడబ్ల్యూజే యూనియన్ 67వ ఆవిర్భవ దినోత్సవం వేడుకలు జిల్లా ఉపాధ్యక్షులు అట్లూరి రాజశేఖర్ ఆధ్వర్యంలో గన్నవరం నియోజకవర్గ ఎలక్ట్రాన్ మీడియా పాత్రికేయ మిత్రులు ఘనంగా నిర్వహించారు…
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న గన్నవరం సిఐ కె కనకారావు, ఎస్సై శ్రీనివాసరావు , సీఐ కె కనకారావు ఏపీయూడబ్ల్యూజే జండా ఆవిష్కరించారు,
ఈ సందర్భంగా సిఐ కనకారావు మాట్లాడుతూ…
గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న విలేకరులందరూ కలిసిమెలిసి ఉండాలని సూచించారు…
సమాజంలో జర్నలిస్టులకు చాలా గౌరవమైన విలువలు ఉన్నాయన్నారు.
అనంతరం స్థానిక బి కే ఆర్ చిల్డ్రన్ మరియు వృద్ధాశ్రమంలో పిల్లలకు వృద్ధులకు పండ్లు ఫలహారాలు పంపిణీ చేశారు.
సీనియర్ పాత్రికేయులు మాస్టర్ గోవిందరాజులు, ఉదయతార అప్పారావు కు సన్మానం నిర్వహించి , పూలమాలలు శాలువాలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో గన్నవరం నియోజకవర్గ పరిధిలోని ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులు అట్లూరి రాజశేఖర్, మున్నంగి నిరీక్షణ రావు, పెదబాబు ,కోడూరి రామకృష్ణ, అప్పారావు ,గోవాడ సునీల్, నిడుమర్తి దావీదు, రేమెళ్ళ రాంబాబు, పడమట నరేష్, మక్బుల్ ,కొమరవెల్లి మురళి, కె అజయ్, సుభాష్, కోటా సురేష్, తిరుమల శెట్టి రవి, ధరావతు హరికృష్ణ, గుర్రం ప్రసాదు, రహీం, అబ్బూరి సునీల్, అబ్బూరి వినోద్, కొమరవల్లి ప్రసన్న, పామర్తి రవి, బాపట్ల కిరణ్, మహేష్ ,మాతంగి కిషోర్, తదితర సహచర మిత్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.