Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
ఆంధ్రప్రదేశ్

‘భోళా శంకర్’ టాక్.. రఫ్ఫాడించిన మెగాస్టార్.. చివరి 90 నిమిషాలు నెక్స్ట్ లెవల్!

156 Views

థియేటర్స్‌లో మెగాస్టార్ బొమ్మ పడితే.. ఫ్యాన్స్‌కి పద పండక లెక్కే. మెగాస్టార్ చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘భోళా శంకర్’ భారీ అంచనాలతో రేపు థియేటర్స్‌లో విడుదల కానుంది

.సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్’ చిత్రానికి హిట్ టాక్ రావడంతో.. ఒక్కరోజు గ్యాప్‌లో వస్తున్న మెగాస్టార్ ‘భోళా శంకర్’ గురించే ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ నడుస్తోంది. వరుస ఫ్లాప్‌లతో ఇండస్ట్రీలో చానాళ్లుగా కనిపించకుండాపోయిన మెహర్ రమేష్‌ని పిలిచి మరీ ‘భోళా శంకర్’ సినిమా ఛాన్స్ ఇచ్చారు మెగాస్టార్.

అయితే ‘భోళా శంకర్’ టైటిల్ నుంచి టీజర్, ట్రైలర్, సాంగ్స్, మేకోవర్ విషయంలో భలే.. భోళా అనేట్టుగానే మెగాస్టార్‌ని చూపించారు మెహర్ రమేష్.చాలామంది మెహర్ రమేష్‌తో సినిమా అంటే.. ఇక ఎత్తేసినట్టే అని చులకన చేశారు.. ట్రోల్ చేశారు. అయితే టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఔట్ పుట్ చూసిన తరువాత మెహర్ బాగానే తీశాడే అనేట్టు చేశారు.ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ కాగా.. కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలుగా నటిస్తుంది.

ఇదీ కథ.. కలకత్తాలో టాక్సీ డ్రైవర్ ‘భోళా శంకర్’. చెల్లెలు కీర్తి సురేష్‌ని మంచిగా చదివించి ఆమెకు మంచి భవిష్యత్ ఇవ్వాలని తాపత్రయపడతాడు. అదే సందర్భంలో శంకర్‌కి సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఎక్కువే. అన్యాయం జరిగితే సహించడు. ఆడపిల్లకి ఆపద వచ్చిందంటే అక్కడ శంకర్ టాక్సీ ఉంటుంది. కలకత్తా నగరంలో మహిళా మిస్సింగ్ కేసులు పెరుగిపోతూ ఉంటాయి. విమెన్ ట్రాఫికింగ్ కేసుల్ని ఛేదించడానికి పోలీసులకు సాయం చేస్తుంటాడు శంకర్. ఈ నేపథ్యంలో శంకర్ చెల్లెలు ఇబ్బందుల్లో పడుతుంది. శంకర్ తన సొంత అన్న కాదనే విషయం తెలుసుకుంటుంది? అసలు ఈ శంకర్ ఎవరు? అతని ఫ్లాష్ బ్యాక్ ఏంటన్నదే మిగిలిన కథ.

సుశాంత్.. కీర్తి సురేష్‌కి జోడీగా నటిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మెగాస్టార్ మూవీ బీభత్సమైన బజ్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మొన్నటి పవన్ కళ్యాణ్ మూవీ ‘బ్రో ’ కం టే కూడా భోళా శంకర్‌కి ఎక్కువ బజ్ ఉండటం విశేషం. పైగా కలకత్తా బ్యాక్ డ్రాప్‌లో సినిమా అంటే మెగాస్టార్‌కి హిట్ పక్కా అనే సెంటిమెంట్ ఉంది. ‘భోళా శంకర్’ కూడా కలకత్తా బ్యాక్ డ్రాప్ మూవీ కావడంతో అభిమానుల అంచనాలు రెట్టింపు అయ్యాయి.వేదాలం సినిమాకి ‘భోళా శంకర్’ రీమేక్ కాగా.. తెలుగులో చాలా మార్పులు చేశారు. కథలో మెయిన్ ప్లాట్‌ని డిస్ట్రబ్ చేయకుండా.. చిరంజీవి నుంచి మెగా ఫ్యాన్స్ ఏదైతే కోరుకుంటారో అవన్నీ ‘భోళా శంకర్’లో రంగరించారు మెహర్ రమేష్. మాసూ.. క్లాసూ మాత్రమే కాదు.. మెగాస్టార్‌లో కామెడీ టైమింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది. కమెడీ టైమింగ్ పండిందంటే నెక్స్ట్ లెవల్ అనేట్టుగానే ఉంటుంది. ‘భోళా శంకర్’లో మెగాస్టార్ కామెడీ టైమింగ్ ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ అంటున్నారు.చిరంజీవి-కీర్తి సురేష్‌ల మధ్య సెంటిమెంట్ సీన్‌లకు సినిమాకి ప్లస్ కాగా.. తమన్నా మిల్కీ అందాలతో గ్లామర్ ట్రీట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. డాన్స్‌లో చిరంజీవి గ్రేస్ అండ్ స్టైల్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఇక తమన్నా కూడా డాన్స్‌లో ఇరగదీస్తుంటుంది. వీళ్లిద్దరూ కలిసి స్టెప్ వేస్తే.. ‘భోలా’.. అదిరిపోలా అనేట్టుగానే ఉంటుంది మరి.అంతేకాదు.. ఇన్ సైడ్ టాక్ ప్రకారం.. ‘భోళా శంకర్’ సినిమాకి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. కొంతమంది అయితే ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ‘భోళా శంకర్’ చిత్రంపై పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. మెహర్ రమేష్‌కి మంచి కమ్ బ్యాక్ మూవీ. సెకండాఫ్‌లో చివరి 90 నిమిషాలు భోళా శంకర్‌లో నెక్స్ట్ లెవల్ అని.. చిరు కామెడీ టైమింగ్‌తో రఫ్ఫాడించేయడం ఖాయం అభిమానులు భావిస్తున్నారు. మరి అంచాలను అందుకుంటుందో లేదో మరి కొన్ని గంటల్లో తేలనుంది.

Related posts

రాజధానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కొడాలి నాని

HJNEWS

చిక్కిన చిరుత…! ఊపిరి పీల్చుకున్న భక్తులు

HJNEWS

ఖుషి ట్రైలర్.. ప్రేమ, పెళ్లి, గొడవలు.. శివ నిర్వాణ మ్యాజిక్

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్