Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
JANASENAరాజకీయం

విశాఖ: ప్రభుత్వానికి చెందిన ఆటోలో పవన్ వారాహి యాత్రకు ప్రచారం.. వీడియో వైరల్

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ చెత్త తరలింపు వాహన డ్రైవర్ పవన్ కళ్యాణ్‌పై అభిమానాన్ని చాటుకున్నాడు. ఆయన ఏకంగా ఇళ్ళ నుంచి చెత్త సేకరించడానికి ఉపయోగించే మైకు సహాయంతో 37వ వార్డులో అన్ని వీధుల్లోకి వెళ్లి శుక్రవారం నుంచి వారాహి యాత్ర ప్రారంభమవుతుందని ప్రచారం చేశాడు. మైక్‌లో సాయంత్రం జగదాంబ జంక్షన్ లో పవన్ బహిరంగ సభ ఉందని జనాలకు తెలిపే ప్రయత్నం చేశాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

విశాఖలో వారాహి ఫీవర్ కొనసాగుతోంది. యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ రాక కోసం జనసైనికులు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ క్రమంలో నగరంలో ఓ విచిత్రమైన సన్నివేశం కనిపించింది. విశాఖలో నిర్వహించబోతున్న వారాహి యాత్రలో గురువారం సాయంత్రం జగదాంబ జంక్షన్లో జరిగే బహిరంగ సభకు హాజరు కావాలంటూ జీవీఎంసీకి చెందిన ఈ చెత్త తరలింపు వాహనంలో డ్రైవర్ మైక్‌లో ప్రచారం చేశారు.

వారాహి యాత్ర ప్రారంభమవుతుందని.. సాయంత్రం జగదాంబ జంక్షన్ లో పవన్ బహిరంగ సభ నిర్వహించబోతున్నారని మైక్‌లో అనౌన్స్ చేశాడు. అందరూ హాజరు కావాలంటూ చేసిన ప్రచారం చర్చనీయాంశంగా మారింది. జీవీఎంసీ చెత్త తరలింపు వాహనం నుంచి జనసేన బహిరంగ సభకు హాజరు కావాలంటూ మైక్‌లో ప్రచారం చేయడంతో అందరూ అవాక్కయ్యారు. ఈ సీన్ మొత్తం చూసి వైఎస్సార్‌సీపీకి చెందిన స్థానిక నేతలు కూడా ఆశ్చర్యపోయారు. వెంటనే ఆ డ్రైవర్ గురించి వివరాలు ఆరా తీశారు.. అతడు పవన్ కళ్యాణ్ అభిమాని అని గుర్తించారు.

37వ వార్డుకు చెందిన కామేష్ జీవీఎంసీ చెత్త తరలించే వాహనానికి కాంట్రాక్ట్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కొందరు స్థానికులు మైక్‌లో వారాహి యాత్ర గురించి ప్రచారం చేస్తున్న సమయంలో వీడియో రికార్డ్ చేసి అధికారులకు పంపారు. ఈ విషయం తెలియడంతో అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ సమాచారాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ కి తెలియజేశారు. ఇలా చేస్తే తన ఉద్యోగం కూడా పోతుందని తెలిసి కూడా కామేష్ మైక్‌లో పవన్ సభ గురించి ప్రచారం చేయడం విశేషం. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. చర్చనీయాంశంగా మారింది. మరి జీవీఎంసీ డ్రైవర్ ఎపిసోడ్‌పై కమిషనర్ ఎలా స్పందిస్తారన్నది చూడాలి.

Related posts

వైఎస్సార్ జయంతి.. ఇడుపులపాలయలో వైఎస్ షర్మిల, విజయమ్మ నివాళులు

HJNEWS

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బెయిల్

HJNEWS

సీన్ ఛేంజ్ కలిసొచ్చేదెవరికి -గన్నవరం నియోజకవర్గంలో

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్