Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యం వైద్యం

20 ఏళ్ల తర్వాత సంతానం.. ఒకేసారి ముగ్గురికి జన్మనిచ్చిన తల్లి, ఇంతలో మాటలకందని విషాదం

ఆటో డ్రైవర్ ఖాసింకు నజీరాతో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తుండగా.. ఈ దంపతులకు సంతానం లేదనే లోటు వెంటాడింది. అయితే 20 ఏళ్ల తర్వాత నజీరా గర్భం దాల్చింది. 10 రోజుల క్రితం ఆమెకు పురిటి నొప్పులు రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ సిజేరియన్ చేయగా.. నజీరా ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ శిశువుకు జన్మనిచ్చింది. అయితే ఇంతలోనే విషాదం వెంటాడింది.

ఆ జంటకు 20 ఏళ్ల క్రితం వివాహమైంది.. కానీ సంతానం లేరనే బాధ మాత్రం వెంటాడుతూనే ఉంది. అయితే ఆమె 20 ఏళ్ల తర్వాత గర్భం దాల్చి ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. కానీ భర్తకు ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు.. ఆమె అనారోగ్యంతో ఆ వెంటనే ప్రాణాలు కోల్పోయింది. కనీసం బిడ్డల్ని కూడా చూడకుండానే కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని నింపింది.

ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం మాగల్లుకు చెందిన షేక్‌ నజీరాకు.. పల్లగిరికి చెందిన ఖాసింతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. దంపతులకు సంతానం మాత్రం లేదు.. 20 ఏళ్ల తర్వాత నజీరా గర్భం దాల్చడంతో కుటుంబంలో ఆనందంలో మునిగిపోయింది. పది రోజుల క్రితం ఆమెకు పురిటి నొప్పులు రావడంతో విజయవాడలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ నజీరాకు డాక్టర్లు సిజేరియన్ చేసి ముగ్గురు పిల్లలను బయటకు తీశారు. వీరిలో ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లవాడు ఉన్నారు.

సిజేరియన్ తర్వాత నజీరాకు రక్తం తక్కువగా ఉండటంతో డాక్టర్లు వెంటనే రక్తం ఎక్కించారు. కానీ ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి ప్రాణాలు కోల్పోయింది. బుధవారం ఆమె మృతదేహాన్ని పల్లగిరికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. 20 ఏళ్ల తర్వాత ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చిన నజీరా ఇక లేదని తలచుకుని భర్త, కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతం అయ్యారు. ఆటో డ్రైవర్‌‌గా ఉన్న ఖాసిం భార్య ప్రాణాలు ఎలాగైనా కాపాడుకోవాలనే ప్రయత్నం ఫలించలేదు. తన ఆర్థిక స్థోమతకు మించి ఖర్చు చేస్తూ అటు పసిపిల్లలకు ప్రైవేటు ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. భార్య ప్రాణాలు నిలబెట్టుకోలేకపోయానని..పిల్లలను ఎలా కాపాడుకోవాలో అని ఖాసిం ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

Related posts

ఆ బాధ్యత నేను తీసుకుంటా.. కడప జిల్లాలో చంద్రబాబు వ్యాఖ్యలు

HJNEWS

ఏపీ దేశానికే ఆదర్శంగా నిలిచింది.. 50 నెలల్లోనే గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చాం: సీఎం జగన్

HJNEWS

‘మల్కాజిగిరి ఎంపీ మిస్సింగ్’.. కలకలం రేపుతోన్న పోస్టర్స్

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్