Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
తెలంగాణసినిమా వార్తలు

తమన్ బాబు.. అంతొద్దు.. కాస్త తగ్గు తగ్గు!

24 Views

పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ ‘బ్రో’.. ఈ సినిమా ప్రీ రీలీజ్ ఈవెంట్‌ను రీసెంట్‌గా గ్రాండ్‌గా నిర్వహించారు. సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ తర్వాత వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. పైగా పవర్ స్టార్‌తో కలిపి వస్తున్న ఈ క్రేజీ కాంబినేషన్ పైన ఇద్దరి ఫ్యాన్స్ లో మరింత భారీ అంచనాలున్నాయి.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై జూలై 28న ఈ సినిమా థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు సాయితేజ్‌తో పాటు వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్‌ కూడా హాజరయ్యారు. అయితే మొదటి నుంచి పవన్ కళ్యాణ్ ఈ వేడుకకు రాడని అంతా అనుకున్నారు కానీ.. ఆయన కూడా మిస్ అవలేదు. ఆడిటోరియం మొత్తం షో అంతా రచ్చలేపుతూ, పవన్ ఫ్యాన్స్ కేరింతల మధ్య సందడిగా జరిగింది.

అయితే ఈ సందర్భంగా తమన్ చేసిన కామెంట్స్ మరింత హీట్ పెంచాయి. ఓ రకంగా చెప్పాలంటే వైరల్ అవుతున్నాయి. అసలే ఈ మధ్యకాలంలో తమన్ కోరి కష్టాలను కొని తెచ్చుకుంటూ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాడు. దానికి ఆజ్యం పోసినట్టు మళ్ళీ ఈ వ్యాఖ్యలతో మరింతగా వార్తలలో హైలెట్ అవుతున్నాడు. విషయంలోకి వెళితే..

‘బ్రో’ సినిమాకి త్రివిక్రమ్ రచనా సహకారం అందిస్తే.. తమిళ యాక్టర్, దర్శకుడైన సముద్రఖని ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. తమిళ్‌లో సూపర్ హిట్ కొట్టిన ‘వినోదయ సిత్తం’ సినిమాకు రీమేక్ ఇది. దీనికి తెలుగులో తమన్ సంగీతం అందించాడు.

అయితే వేదిక మీద మైక్ పుచ్చుకోగానే ఊగిపోయిన తమన్.. ఈ మధ్య పవన్ కళ్యాన్ సినిమాలన్నింటికీ తనే సంగీతం అందించానని చెప్పే సందర్భంలో.. ‘‘ప్రపంచంలో నా అంత లక్కీ ఇంకొకరు ఉండరు.. పవన్ కళ్యాణ్ సినిమాలన్నింటికీ వకీల్ సాబ్, భీమ్లా నాయక్, ఇప్పుడు బ్రో , తర్వాత రాబోతున్న ‘OG’ సినిమాలకు గొప్ప సంగీతం అందివ్వడం నా అదృష్టం’’ అన్నాడు.
ఇక ఇప్పటికే తమన్ మ్యూజిక్ అనగానే అవే డప్పుల మోతలు, అవే విన్న ట్యూన్స్ ఉంటాయనే మాట ఎలానో ఉండనే ఉంది. దానికి తోడు.. ఈమధ్య ఒప్పుకున్న ప్రాజెక్ట్స్‌కి సరైన న్యాయం చేయడం లేదని, ‘బ్రో’ సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన పాటలకు కూడా పెద్దగా న్యాయం చేయలేదనే ట్రోల్స్ జరుగుతున్నాయి.

మళ్లీ ‘OG’కి కూడా తమనే సంగీతం అంటే ఆ పాటలు ఏ స్థాయిలో ఉంటాయోనని పవన్ ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు. ఇలా ఈమధ్య కాలంలో తన చేతలతో, తన నోటి దురుసుతో చిక్కుల్లో పడుతున్నాడు తమన్. కాస్త తగ్గి ఉండటం కూడా నేర్చుకోవాలని తమన్ అంటూ.. ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా సలహాలు ఇస్తుండటం గమనార్హం.

Related posts

ఒక తల్లిగా వాళ్ల బాధ నాకు తెలుసు.. సింగిల్ మదర్స్‌కు ఉపాసన గుడ్ న్యూస్

HJNEWS

షూటింగ్లో గాయపడ్డ సింగర్ మంగ్లీ.. ఆందోళనలో ఫ్యాన్స్..!

HJNEWS

ఏమాత్రం వన్నె తగ్గని త్రిష.. రోడ్డుపై శ్రీలీల డ్యాన్స్.. బ్రో బ్యూటీ ట్రీట్

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్