సైబర్ స్కామర్స్ పంజా తారస్థాయికి చేరుకుంది. సైబర్ వార్ కు ముగింపు ఎప్పుడు పడుతుందో తెలియని పరిస్థితి దేశమంతా నెలకొంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న సైబర్ నేరాల కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.. అచ్చం జంతార సినిమాలో చూపించిన విధంగానే రోజుకో సైబర్ క్రైమ్ స్కామ్ పుట్టుకొస్తూనే ఉంది. రాత్రికి రాత్రి కొత్త స్కామ్ ను ఆపరేట్ చేస్తున్నారు. వాట్సప్ కేంద్రంగా జరుగుతున్న స్కాంపై వాట్సాప్ యూజర్లు అప్రమత్తంగా ఉండాలి. గతంలో సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి మనకు తెలియకుండానే మన పేర్ల మీద డబ్బులు రిక్వెస్ట్ లు పెట్టిన ఘటనలు చాలా ఉన్నాయి. ఇప్పుడు స్కామర్లంతా వాట్సాప్ మీద పడ్డారు. ఏదో ఒక అకేషన్ సెలెక్ట్ చేసుకుని ఆఫర్ల పేరుతో మన వాట్సప్ కి మెసేజ్ పంపుతు డబ్బులు లాగేస్తున్నారు కేటుగాళ్లు..
యోగా డే రోజున మొదలైన వాట్సప్ స్కామర్స్ కొత్త స్కెచ్..
గత నెల జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా యోగా డే కార్యక్రమాలు నిర్వహించారు. దీన్ని అదునుగా చేసుకున్న వాట్సాప్ స్కామర్లు యోగా క్లాస్ ల పేరుతో మెసేజ్లు పంపించారు. యోగా క్లాస్ జాయిన్ అవుదాం అనుకొని వీళ్ళు పంపిన లింకును క్లిక్ చేశారు వాట్సప్ యూజర్లు. ఆ లింకు క్లిక్ చేయగానే వాట్సప్ పేరుతో ఒక కోడ్ ఓటీపీ రూపంలో ఒచ్చింది. యోగా క్లాస్ కావాలంటే ఆ కోడ్ తమకి చెప్పాలని స్కామర్లు వాట్సాప్ యూజర్లను నమ్మించారు. ఆ కోడ్ ను తిరిగి స్కామర్లకు చెప్పగానే యూజర్ల వాట్సాప్ ప్రొఫైల్ యాక్సిస్ అంతా స్కామర్ల చేతికి వెళ్లిపోయింది. దీంతో యూజర్ కాంటాక్ట్స్ లో ఉన్న స్నేహితులకు డబ్బులు కావాలని మెసేజ్లు పెడుతున్నారు స్కామర్లు. ఇలాంటి ఘటన గత నెల కోల్కతాలో చోటుచేసుకుంది. వాట్సాప్ నుండి తమ పేరుతో డబ్బులు అడుగుతున్నారని పోలీసులకి భారీగా ఫిర్యాదులు అందాయి. దీంతో అనుమానాస్పద మెసేజ్లను ఎట్టి పరిస్థితుల్లో ఫార్వర్డ్ చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
మీ వాట్సాప్ హ్యాక్ కాకుండా చూసుకోవడం ఎలా?
1) అనుమానాస్పద వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్లను ఎప్పుడూ ఫార్వర్డ్ చేయవద్దు.
2) వాట్సప్ కోడ్ పేరుతో వచ్చే ఎస్ఎంఎస్/ ఓటీపీ లను ఎవరికి షేర్ చేయవద్దు
3) ఎమర్జెన్సీ మెసేజ్లు వచ్చిన సమయంలో సంబంధిత స్నేహితుడికి ఫోన్ చేసి క్రాస్ చెక్ చేయాలి
4) వాట్సప్ యాక్టివేషన్ కోసం 2 స్టెప్ వెరిఫికేషన్ కచ్చితంగా చేసుకోవాలి
5) అనుమానాస్పద మెసేజ్ ల పై వెంటనే రిపోర్ట్ క్లిక్ చేయండి.
ఇలా చేస్తున్నారా? మీ వాట్సాప్ హ్యాక్ అయినట్లే.. తప్పక తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది..!
139 Views