14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏనాడు చేయలేనిది.. జగన్మోహనరెడ్డి తన నాలుగేళ్ల పరిపాలనలో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కడుతున్నాడు..
చంద్రబాబు చేయలేనిది.. జగన్మోహనరెడ్డి తన నాలుగు పెద్ద ఓడరేవులు పది ఫిషింగ్ హర్భర్లు కడుతున్నాడు..
చంద్రబాబు చేయలేనిది.. జగన్మోహనరెడ్డి చట్టప్రకారం కేంద్రం నుండి పోలవరానికి రావాల్సిన నిధులు రైట్ రాయల్ గా డిల్లీ నుంచి తీసుకొని వచ్చాడు..
చంద్రబాబు చేయలేనిది.. అసలు ఇక రావనుకుని ఆశలు వదులుకున్న పదేళ్ల నాటి విభజన నాటి రెవిన్యూ లోటు పెండింగ్ నిధులు ఏకంగా వేల కోట్ల రూపాయలు ఈరోజున రాష్ట్రనికి తీసుకొచ్చి చూపించాడు..
చంద్రబాబు చేయలేనిది.. దేశంలో మరే ఇతర బీజేపి పాలిత రాష్ట్రానికి కూడ రానంత ఎక్కువగా ఏపీకి నేషనల్ హైవేలను తీసుకొచ్చాడు..
చంద్రబాబు చేయలేనిది.. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉన్న ఇనుప గోడలను కూల్చేసి.. ప్రభుత్వ పరిపాలనను నేరుగా మన గ్రామం నడిబొడ్డుకి తీసుకొచ్చాడు..
చంద్రబాబు చేయలేనిది.. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పధకాలను ఫించన్లను ఒకటో తారీఖు ఉదయమే నేరుగా మన ఇంటికే తీసుకొచ్చి ఇస్తున్నాడు.. అదీ కులం మతం రాజకీయం చూడకుండా.. ఒక్క రూపాయి అవినీతి లేకుండా.. జన్మభూమి కమిటీలు లాంటి స్ధానిక రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా..
చంద్రబాబు చేయలేనిది.. జగన్మోహనరెడ్డి ప్రభుత్వ సహయం నేరుగా లబ్ధిదారుడికే అందిస్తున్నాడు.. ప్రతి రూపాయి పూర్తిగా పారదర్శకంగా..
చంద్రబాబు చేయలేనిది.. టౌన్ లో డబ్బున్నోళ్ళు చదివే ఖరిదైన ఇంగ్లీష్ మీడియం చదువులను గ్రామాల్లోని పేదపిల్లల వాడలకి చేర్చాడు..
చంద్రబాబు చేయలేనిది.. ఆయన హయంలో పూర్తిగా నిర్వీర్యం అయిపోయిన అదే ప్రభుత్వ పాఠశాలల్లో జగన్మోహనరెడ్డి అధ్భుత ఫలితాలు తీసుకొచ్చి చూపించాడు..
చంద్రబాబు చేయలేనిది.. ఈయన నాడు నేడు కింద ప్రభుత్వ స్కూళ్లు ఆసుపత్రుల తలరాతను పూర్తిగా మార్చిపారేసాడు.. పిల్లలకు మంచి భోజనం పెడుతున్నాడు..
తన హయంలో చంద్రబాబు ఏరోజు కనీసం ఆలోచన చేయనంత విధంగా.. కరోనా కష్టకాలంలో కూడా కనీవిని ఎరగని స్ధాయిలో సంక్షేమ పధకాలను ప్రజలకు అందించి.. వారిని ఆదుకొని తాన మార్క్ పాలనేంటో చుపించాడు..
దేశ చరిత్రలో కనీవిని ఈరోజున రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుపేదలకు ఉచితంగా ఇళ్లపట్టాలు ఇవ్వడమే కాకుండా ఆ స్థలాల్లో ఇళ్లు కట్టించి ఇచ్చి ఒక్కో నిరుపేద కుటుంబాన్ని కొన్ని లక్షల రూపాయల ఆస్తికి యజమానులను చేశాడు..
ఇక ఇలా చెప్పుకుంటూ పోతే.. చంద్రబాబు తన జీవితంలో ఎన్నడూ చేయలేని పనులు.. ఈయన తన నాలుగేళ్ళ పాలనలో ఎన్నో ఆటుపోట్లని ఎదుర్కొని.. అత్యంత సహసోపేతంగా చేసి చూపించాడు..
ఇక ఈయన వచ్చాక ఒక్కసారన్న కరువు మండలాలను ప్రకటించడం చూశామా? వరుసగా ఐదేళ్ళు వానలు పడి ప్రాజెక్టులు నిండి.. పండిన పంటలకు ఈ స్ధాయి గిట్టుబాటుధరలు ఎప్పుడన్నా చూశామా? ఇంతటి డిమాండ్ లో కూడ ఎరువులు కొరత విత్తనాల కొరత అంటూ ఈ ఐదేళ్ళలో ఎప్పుడైనా విన్నామా?
ఇక ఈయన చేయలేనివి..
చంద్రబాబు గారి లా.. అబద్దపు అమలు కానీ హమీలు ఇవ్వకపోవడం..
చంద్రబాబు గారి లా ఎప్పటికి పూర్తి చేయలేని గ్రాఫిక్స్ రాజధానులు కట్టించకపోవడం..
చంద్రబాబు గారిలా.. రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెత్తందారుల ప్రయోజనాలు కపాడకపోవడం..
చంద్రబాబులా బలిసినోళ్ళ వైపు కాకుండా.. సమాజంలో ఏ ఆదరవు లేని పేదప్రజల పక్షాన నిలబడడం..
ఇక్కడ జనం అన్నీ గమనిస్తున్నారు.. జయహో జగనన్న