Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
ఆంధ్రప్రదేశ్

చెవిరెడ్డి మెడకు ఆర్టీసీ భూముల ఉచ్చు……ఆరా తీస్తున్న టీడీపీ నాయకులు, చంద్రబాబు సొంత ఊరులో!

ఎన్డీఏ ప్రభుత్వం వైసీపీ నాయకులకు చుక్కలు చూపించడానికి సిద్దం అవుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో అధికారం అడ్డం పెట్టుకుని ప్రభుత్వ భూములను తక్కువ ధరకు లీజుకు తీసుకున్న వారిని టార్గెట్ చేస్తోందని తెలిసింది. మాజీ సీఎం, వైసీపీ చీఫ్, తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద చంద్రబాబు ప్రభుత్వం ఫోకస్ పెడుతోందని తెలిసింది.

గత లోక్ సభ ఎన్నికల్లో ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓడిపోయారు. ఇక చంద్రగిరి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి కూడా ఓడిపోయారు. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో చక్రం తిప్పి కోట్లాది రూపాయల ఆర్టీసీ భూములను అతి తక్కువ ధరకు లీజుకు తీసుకున్నారని వెలుగు చూసింది.గత ఏడాది నవంబర్ లో ఆర్టీసీ అధికారులు టెండర్లు పిలవగా స్థలాలను లీజుకు తీసుకోవడానికి పోటీ పడిన వారిని బెదిరించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కుమారుడు మోహిత్ రెడ్డికి చెందిన సీఎంఆర్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఆర్టీసీ స్థలాలను లీజ్ అగ్రిమెంట్ చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. చెవిరెడ్డి ఫ్యామిలీకి ఆర్టీసీ భూములు లీజు ఎలా కట్టబెట్టారు అని టీడీపీ నాయకులు ఆరా తీస్తున్నారు.ఒంగోలు ఆర్టీసీ డిపో పరిధిలో 1,978 చదరపు అడుగుల స్థలానికి జీఎస్టీ కాకుండా నెలకు రూ. 2.26 లక్షలు చెల్లించేలా 33 ఏళ్లకు లీజు అగ్రిమెంట్ చేసి ఇచ్చారనివెలుగు చూసింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, అద్దంకి డిపోల పరిధిలో చెవిరెడ్డి కుటుంబ సభ్యులు ఆర్టీసీ స్థలాలను 15 ఏళ్లకు లీజుకు దక్కించుకున్నారని వెలుగు చూసింది. అయితే ఆర్టీసీ అధికారులు టెండర్లు పిలిచారని, టెండర్లలో పాల్గొన్నవారిని చెవిరెడ్డి అనుచరులు బెదిరించి వారు వెళ్లిపోయేలా చేసి తక్కువ ధరకు ఆ స్థలాలను లీజుకు దక్కించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.

తిరుపతిలో చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని మీద చెవిరెడ్డి అనుచరులు దాడి చేసిన విషయం తెలిసింది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పుట్టిపెరిగిన చంద్రగిరి నియోజక వర్గం వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద అనేక ఆరోపణలు రావడంతో వాటి వ్యవహారంలో విచారణ జరిపించాలని టీడీపీ నాయకులు సీఎం చంద్రబాబు మీద ఒత్తిడి చెయ్యడానికి సిద్దం అయ్యారని తెలిసింది.

Related posts

‘తెర వెనుక ఉంది చిరంజీవే.. భార్యల బంగారం అమ్ముకున్నారు’

HJNEWS

విలేకరి ఇంటిపై విధ్వంసకాండ

HJNEWS

బాపులపాడు సీ యస్ ఐ చర్చి సంఘస్తుల ఆందోళన…..!

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్